https://oktelugu.com/

China : భూమికి అతిపెద్ద రంధ్రం చేస్తున్న చైనా.. వీడు ఏం చేస్తాడో అని వణికి పోతున్న ప్రపంచ దేశాలు

China : ఎన్నో అద్బుత కట్టడాలకు ప్రసిద్ధి చెందిన దేశం చైనా. టెక్నాలజీలో దానికి అదే సాటి. అలాగే ప్రపంచం మీదకు రోజు కో వైరస్ ను వదులుతున్న దేశం. ప్రస్తుతం భూమి పొరల్లోకి వెళ్లాలని భావిస్తుంది.

Written By: , Updated On : February 22, 2025 / 12:56 PM IST
China

China

Follow us on

China : ఎన్నో అద్బుత కట్టడాలకు ప్రసిద్ధి చెందిన దేశం చైనా. టెక్నాలజీలో దానికి అదే సాటి. అలాగే ప్రపంచం మీదకు రోజు కో వైరస్ ను వదులుతున్న దేశం. ప్రస్తుతం భూమి పొరల్లోకి వెళ్లాలని భావిస్తుంది. భూమి క్రస్ట్‌లోకి 10,000 మీటర్ల లోతు డ్రిల్లింగ్ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టును కొద్ది నెలల కిందట ప్రారంభించింది. చైనాలో అత్యంత లోతైన బోరుబావిని తవ్వే మొదటి ఆపరేషన్ గతేడాది ఏడాది మేలో మొదలైంది. చమురు సమృద్ధిగా ఉన్నటువంటి జిన్‌జియాంగ్ ప్రాంతంలోని తారిమ్ బేసిన్‌లో ఈ పనిని చైనా ప్రారంభించింది. చైనా నేషనల్ పెట్రోలియం కార్ప్ (CNPC) సిచువాన్ ప్రావిన్స్‌లోని షెండి చువాన్కే లో 10,520 మీటర్ల (సుమారు 6.5 మైళ్లు) లోతుకు తవ్వాలని భావించింది.

చైనా నేషనల్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (CNPC) చేపట్టిన ‘షెండీటేక్‌1’ ప్రాజెక్టులో అత్యంత లోతైన బోరుబావి తవ్వకం 10.9 కి.మీ లోతులో విజయవంతంగా పూర్తి అయ్యింది. ఈ బోరుబావిని సుమారు 580రోజుల పాటు తవ్వి పూర్తి చేసింది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న CNPC..ఇది ఇప్పుడు ఆసియాలో అత్యంత లోతైన బోరుబావిగా నిలిచింది.

ఈ బోరుబావి తవ్వడం కేవలం చమురు , గ్యాస్‌ వంటి నిక్షేపాల కోసం మాత్రమే కాకుండా, భూగర్భశాస్త్రంపై మరింత అధ్యయనాన్ని జరపడానికి అని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు దాదాపు 580 రోజుల సమయాన్ని తీసుకుంది. ఇందులో 10వేల మీటర్ల బోరుబావి తవ్వడం 279 రోజులు పట్టగా, 910 మీటర్లకు సుమారు 300 రోజులు పట్టినట్లు సమాచారం.

‘షెండీటేక్‌1’ బోరుబావి, చైనా తక్లమకాన్‌ ఎడారి ప్రాంతంలో జరిగింది. దీని ద్వారా చైనా నేషనల్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ భూగర్భశాస్త్రంపై మరింత లోతైన అధ్యయనం చేయడానికి అవకాశం కల్పించింది. ఈ ప్రాజెక్టు 2023 మే 30న ప్రారంభమైంది. ప్రపంచంలోనే అత్యంత లోతైన బోరుబావి రష్యాలో ఉంది. కోలా సూపర్‌డీప్‌ బోర్‌హోల్‌ ఎస్‌జీ-3 పేరుతో రష్యా 12.2 కి.మీ (12,262 మీటర్లు) లోతులో బావిని 1989లో తవ్వింది. అయితే, చైనా తవ్వని బావి ఇప్పుడు రెండో అత్యంత లోతైన బోరుబావిగా గుర్తింపు పొందింది.

ఈ బోరుబావి తవ్వకానికి సంబంధించి 12 భౌగోళిక నిర్మాణాలు తవ్వడం, 50 కోట్ల సంవత్సరాల నాటి రాతి పొరలను తవ్వి CNPC విజయం సాధించింది. ‘షెండీటేక్‌1’ బోరుబావి చైనాకు, ప్రపంచం మొత్తానికి ఒక గొప్ప శాస్త్రీయ విజయం అని చెప్పవచ్చు.ఈ ప్రాజెక్టు భూగర్భశాస్త్రం, భూమి పైన వనరులను వివరంగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడే శాస్త్రీయంగా అమూల్యమైన ప్రాజెక్టు గా చెప్పవచ్చు. 10 కి.మీ లోతుని తవ్వి, భూగర్భంలో పగుళ్లు, రాతి పొరలు, వాతావరణ మార్పులు, భూకంపాల ప్రభావం వంటి అనేక అంశాలను పరిశీలించడానికి ఇది సహాయపడవచ్చు.