Seediri Appalaraju: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు( seedhiri appala Raju) ఎందుకు సైలెంట్ అయ్యారు? కేసులకు భయపడుతున్నారా? లేకుంటే వైసీపీ ఇన్చార్జ్ పదవి నుంచి తొలగిస్తారు అన్న భయమా? ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు డాక్టర్ అప్పలరాజు. సర్దార్ గౌతు లచ్చన్న మనుమరాలు, మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ కుమార్ గౌతు శిరీషను ఓడించారు. అయితే ఇప్పుడు అదే శిరీష చేతిలో ఓడిపోయారు డాక్టర్ అప్పలరాజు. అయితే ఎన్నికల ఫలితాలు అనంతరం పలాస నియోజకవర్గంలో పొడిపొడిగా మాత్రమే కనిపిస్తున్నారు. దీంతో డాక్టర్ రూట్ మార్చుతున్నారా? లేకుంటే పార్టీ సైడ్ చేసిందా? అని చర్చ బలంగా నడుస్తోంది. అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని రకాల అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వాటికి భయపడి ఆయన సైలెంట్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు పలాస నియోజకవర్గంలో వైసిపి నాయకత్వ మార్పు ఉంటుందన్న టాక్ కూడా వినిపిస్తోంది.
* అనూహ్యంగా రాజకీయాల్లోకి.. మత్స్యకార( fisheries) సామాజిక వర్గానికి చెందిన అప్పలరాజు పలాసలో ప్రముఖ వైద్యుడిగా ఉండేవారు. ఈ క్రమంలో బలమైన ప్రత్యర్థిగా ఉన్న గౌతు కుటుంబానికి ఢీకొట్టే నేత కోసం జగన్మోహన్ రెడ్డి వెతుకుతుండేవారు. ఈ క్రమంలో దూకుడు స్వభావం కలిగిన అప్పలరాజు అయితే సరిపోతారని భావించి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించారు. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. గెలిచిన అప్పలరాజుకు తన క్యాబినెట్లో ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే గత ఐదేళ్లలో చాలా దూకుడుగా వ్యవహరించారు. దీనిని ప్రతిఘటించేవారు ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు శిరీష. దీంతో తరచూ వివాదాస్పద ఘటనలు పలాస నియోజకవర్గంలో జరిగేవి. అదే సమయంలో అప్పలరాజు తీరు నచ్చక చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం అభ్యర్థి గౌతు శిరీష కు జై కొట్టారు. 2024 ఎన్నికల్లో దారుణంగా శిరీష చేతిలో ఓడిపోయారు అప్పలరాజు.
* అసమ్మతి వర్గం
అయితే ఎన్నికలకు ముందు అప్పలరాజు( appala Raju ) అభ్యర్థిత్వాన్ని చాలామంది వైసీపీ నేతలు వ్యతిరేకించారు. అప్పలరాజును మార్చి కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ తనను నమ్మిన నేత కావడంతో అప్పలరాజు కు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. దీంతో అప్పలరాజు దారుణంగా ఓడిపోయారు. అయితే ఇప్పుడు నియోజకవర్గ ఇన్చార్జిను మార్చాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. అదే సమయంలో అప్పలరాజు సైతం ఫుల్ సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులకు అందుబాటులో లేనట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన స్థానంలో వేరొకరికి ఛాన్స్ ఇవ్వాలని పార్టీలో సీనియర్లు నేరుగా కోరుతున్నట్లు సమాచారం.
* చాలా దూకుడు
మాజీ మంత్రి అప్పలరాజు చాలా దూకుడుగా ఉండేవారు. అప్పట్లో చంద్రబాబుపై( Chandrababu) కూడా విమర్శలు చేసేవారు. ఒకానొక దశలో చంద్రబాబు పలాస వచ్చినప్పుడు అప్పుడు మంత్రిగా ఉన్న అప్పలరాజును ఉదహరించి గట్టిగానే హెచ్చరికలు పంపారు. చెరువు చేప కథ చెప్పి.. భవిష్యత్తులో అప్పలరాజుకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గౌతు శిరీష సైతం మంత్రి అప్పలరాజు పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అప్పట్లో పశుసంవర్ధక శాఖ మంత్రిగా అప్పలరాజు తీసుకున్న నిర్ణయాలపై పునసమీక్షిస్తున్నారు. చాలా రకాల వైఫల్యాలు, అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణలు ఉండడంతో.. తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని తెలిసి అప్పలరాజు సైలెంట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు అప్పలరాజు బిజెపిలో చేరతారని తెలుస్తోంది. బిజెపి అగ్రనేతలకు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.