Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ(Champions trophy 2025)లో మరో బిగ్ ఫైట్ కు తెరలేచింది. శుక్రవారం ఇంగ్లాండ్(England), ఆస్ట్రేలియా(Australia) మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా జట్టు గాయాలతో సతమతమవుతోంది. మరోవైపు భారత జట్టు చేతిలో ఇటీవల టీ20, వన్డే సిరీస్లలో ఇంగ్లాండ్ జట్టు భంగపడింది. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ వెళ్లాలంటే కచ్చితంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం..
లాహోర్ లోని గడాఫీ స్టేడియం(Lahore Gaddafi stadium)లో మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల నుంచి ఈ మ్యాచ్ మొదలవుతుంది. గ్రూప్ బి లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది..ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు కమిన్స్, జోష్ హజిల్ వుడ్, మిచెల్ మార్ష్ గాయాల బారిన పడ్డారు..స్టార్క్ వ్యక్తిగత కారణాలవల్ల టోర్నీకి దూరంగా ఉన్నాడు.. మరో స్టార్ ఆటగాడు మార్కస్ స్టోయినిస్ గాయం వల్ల ఏకంగా వన్డేలకే రిటైర్మెంట్ ప్రకటించాడు. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ లేకపోవడంతో తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ మిత్ ఆస్ట్రేలియా గట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
భారత్ చేతిలో భంగపాటు
చాంపియన్స్ ట్రోఫీ(Champions trophy 2025) ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ భారత దేశంలో పర్యటించింది. టి20, వన్డే సిరీస్లో ఆడింది. ఈ రెండిట్లోనూ భారత జట్టు చేతిలో ఇంగ్లాండ్ భంగపాటుకు గురైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో ఇంగ్లాండ్ జట్టు ఏ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన చూపించలేదు.. ఆస్ట్రేలియా తో మ్యాచ్ ప్రారంభం కి ముందు ఇంగ్లాండ్ తుది జట్టును వెల్లడించింది. ఇందులో భాగంగా ఈ ఆటగాడు జెమీ స్మిత్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేనున్నాడు. నాలుగో స్థానంలో రూట్ బ్యాటింగ్ కు వస్తాడని తెలుస్తోంది.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇప్పటివరకు 161 సార్లు వన్డేలలో ఎదురుపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 91సార్లు, ఇంగ్లాండ్ 65 సార్లు విజయం సాధించాయి. రెండు మ్యాచ్లు టై అయ్యాయి. ఇప్పుడు మ్యాచ్లో ఫలితం రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్లలో తలపడ్డాయి. ఇంగ్లాండ్ మూడుసార్లు, ఆస్ట్రేలియా రెండుసార్లు విజయం సాధించాయి. అయితే చాంపియన్స్ ట్రోఫీ చివరి రెండు ఎడిషన్లలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా పై విజయాన్ని సాధించింది. ఇక ఈ రెండు చెట్లు ఇటీవల చివరిసారిగా తరబడిన ఐదు వన్డేలలో ఆస్ట్రేలియా 3, ఇంగ్లాండ్ రెండు మ్యాచ్లలో విజయం సాధించాయి. గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం ఆస్ట్రేలియా(AUS vs ENG)52 శాతం, ఇంగ్లాండ్ 48% విజయం సాధించడానికి అవకాశాలున్నాయి.
తుది జట్ల అంచనా ఇలా
ఆస్ట్రేలియా
స్మిత్(కెప్టెన్), మాక్స్ వెల్, హెడ్, జోష్ ఇంగ్లిష్, షార్ట్, మెక్ గూర్క్, హార్డీ, అబాట్, జంపా, తన్విర్ సంఘా, నాథన్ ఇల్లిస్, లబూ షేన్, క్యారీ, ద్వార్టు యిష్.
ఇంగ్లాండ్
సాల్ట్, డకెట్, స్మిత్, రూట్, బ్రూక్, బట్లర్ (కెప్టెన్), లివింగ్ స్టోన్, కార్సే, ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అసాధారణ స్థాయిలో భద్రత ఏర్పాటు చేసింది. దాదాపు వందలాది మంది పోలీసులను మోహరించింది.