దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వివిధ ప్రాంతాలలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నారు. అయినా కేసుల నమోదులో తేడా లేకుండా పోతోంది. ఎప్పటిలాగానే తన ప్రభావాన్ని ఉధృతం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాల సంఖ్య మాత్రం ఆందోళనకరంగా ఉంటోంది. రోజుకు నాలుగు వేల మరణాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఏర్పడింది.
ఎదురుదెబ్బ
ప్రధాని నరేంద్ర మోదీకి ఎదురు దెబ్బ తగిలింది. కరోనా పరిస్థితులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ద ఇండియన్ సార్స్ సీవోవీ-2 జీనోమిక్ కన్సార్థఇయం చైర్మన్ షహీద్ జమీల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కరోనా విషయంలో పలు అధ్యయనాలు అర్థంతరంగా ఆగిపోయే ప్రమాదముంది. ఈ అడ్వైజరీ గ్రూప్ ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో పని చేస్తోంది.
కీలక బాధ్యతలు
ఈ అడ్వైజరీ గ్రూప్ ఆధ్వర్యంలో అనేక పరిశోధనలు కొనసాగుతాయి. కరోనా ఉధృతి తగ్గడానికి చేపట్టాల్సిన చర్యలు, కొత్త రకం వ్యాధుల విజృంభనలపై అధ్యయనం, కరోనా వ్యాప్తి చెందకుండా చేపట్టాల్సిన కట్టడిపై కేంద్రానికి సిఫారసు వంటి అనేక పనులు ఈ గ్రూప్ ఆధీనంలో ఉన్నాయి. ప్రస్తుతం గ్రూప్ చైర్మన్ రాజీనామాతో పనులు స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. వేరియంట్ 117 గురించి మొదటిసారి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది ఈ గ్రూపే.
మందకొడిగా పనులు
దేశంలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో గ్రూప్ చైర్మన్ రాజీనామాతో కోవిడ్ మేనేజ్ మెంట్, వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్నాయి. వ్యాక్సిన్ కొరత, ఆరోగ్య వ్యవస్థ బలహీనతపై ఆయన పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో తాను రాజీనామా చేశానని చెప్పారు. కరోనా విధానాలు జమీల్ హర్యానాలోని అశోకా విశ్వవిద్యాలయం బయోసైన్స్ విభాగంలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన అనేక పరిశోధనలు చేశారు. కొత్త రకమైన ఆవిష్కరణలు గావించారు. ప్రస్తుతం జమీల్ రాజీనామాతో మోదీ సర్కారుకు చుక్కెదురైనట్లు అయిందని పరిశీలకులు భావిస్తున్నారు.