
కరోనా బారినపడుతున్న రాజకీయ నాయకులు సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా ఇవాళ బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కోవా లక్ష్మణ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ పరీక్ష చేయించుకొని ఐసోలేషన్ లో ఉండాలని ఆయన సూచించారు.