తౌక్తే తుపాన్ ప్రభావం మహారాష్ట్ర పై పడింది. తుపాన్ వల్ల ముంబై నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై నగరంలోని ఛత్రపతి శివాజి మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారీ వర్షాలు కురుస్తున్నందున ముందుజాగ్రత్త చర్యగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. భారీ వర్షం వల్ల బాండ్రా వర్లీ సీ లింక్ ను మూసివేస్తున్నట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని మున్సిపల్ అధికారులు సూచించారు.