Bipin Rawat: భారత ఆర్మీ త్రివిధ దళాల అధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కన్నుమూయడం విషాదం నింపింది. బిపిన్ ఆర్మీ ప్రయాణిస్తున్న వాయుసేన హెలీక్యాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బిపన్ రావత్ తోపాటు ఆయన భార్య సహా 13మంది మృతిచెందినట్లు వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ చికిత్స పొందుతున్నారు. మొత్తం 14మంది ప్రయాణికుల్లో ఈయన ఒక్కరే బతికున్నారు.
దేశ రక్షణ రంగాలకు అధిపతి ఇలా హెలిక్యాప్టర్ ప్రమాదంలో కన్నుమూయడం తీవ్ర విషాదం నింపింది. తమిళనాడులోని కోయంబత్తూరు, కూనురు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Also Read: బిపిన్ రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదంపై విచారణకు ఆదేశం.. కొనసాగుతున్న ఉత్కంఠ.!
వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ కాలేజీలో ప్రసంగించేందుకు వెళుతున్న బిపిన్ రావత్, ఆర్మీ ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూలురు ఎయిర్ బేస్ నుంచి ఆర్మీ హెలిక్యాప్టర్ లో వెల్లింగ్టన్ వెళుతుండగా ప్రమాదవశాత్తూ కుప్పలకూలింది. బిపిన్ రావత్ దంపతులతోపాటు 13మంది మరణించారు.
ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని షాక్ గురిచేసింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేదంటే ఏదైనా కుట్రకోణం ఉందా? అనేది తేలాల్సి ఉంది. ఈ ప్రమాదం వార్త తెలియగానే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధాని మోదీకి సమాచారం అందించారు. ఆయన వెంటనే అత్యవసరంగా కేంద్ర క్యాబినేట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిపై చర్చిస్తున్నారు.
Also Read: కూప్పకూలిన ఆర్మీ పెద్ద హెలికాప్టర్.. కాసేపట్లో కేంద్రం కీలక ప్రకటన?