Helicopter Crash: నేల మీద కాకుండా గాలిలో జరిగే హెలికాప్టర్ ప్రయాణం అందరికీ ఇష్టమే. ఈ విమాన ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. నింగిలో చేసే ఈ జర్నీలో ఎంత ఆనందం ఉందో అంత ప్రమాదమూ ఉంది. నింగిలోకి వెళ్లిన తర్వాత ఏదేని సాంకేతిక కారణాల వల్లనో లేదా సిగ్నలింగ్ సిస్టమ్ లేదా ప్రకృతి సహకరించకపోయినా ప్రాణాలు గాల్లోనే కలిసే ప్రమాదముంది. తాజాగా భారత త్రివిధ దళాల అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్) బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు. ఈ సందర్భంలో గతంలో హెలికాప్టర్ ప్రమాదాలకు గురైన వారిలో కొందరు ప్రముఖులు వీళ్లే..
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న ఆర్మీ హెలికాప్టర్ యాక్సిడెంటల్లీ తమిళనాడు స్టేట్‌లోని కోయంబత్తూరు, కూనురు మధ్య క్రాష్ అయింది. ఇందులో బిపిన్ రావత్, ఆయన భార్య, ఇంకా 14 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరణాలను అధికారులు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. గతంలో హెలికాప్టర్ ప్రమాదాల్లో చాలా మందే చనిపోయారు.
ప్రముఖ సినీ నటి సౌందర్య 2004లో ఎన్నికల తరఫున ప్రచారానికి వెళ్లబోయి హెలికాప్టర్ క్రాష్‌లో ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరులోని జక్కూరు ఎయిర్‌పోర్ట్ నుంచి తెలంగాణలోని కరీంనగర్‌కు ఆమె రావాల్సి ఉంది. కానీ, బెంగళూరులో విమానం గాల్లోకి లేచిన కొద్ది క్షణాల్లో అదుపు తప్పి కుప్పకూలిపోయింది. దాంతో అందులో ఉన్న సౌందర్య చనిపోయారు.
భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ చిన్న కుమారుడు, పార్టీ సీనియర్ లీడర్ సంజయ్ గాంధీ హెలికాప్టర్ గ్లైడర్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన వెంటనే ఆయన ప్రయాణిస్తున్న గ్లైడర్ కూలిపోయింది. దాంతో సంజయ్ స్పాట్ లోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా సైతం విమాన ప్రమాదంలో 2001లో చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు బహిరంగ సభలో ప్రసంగించేందుకు మాధవరావు సింధియా వెళుతుండగా దుర్ఘటన జరిగి ఆయన ప్రాణం కోల్పోయారు.
Also Read: Bipin Rawat: బిపిన్ రావత్ మరణానికి కారణమైన హెలిక్యాప్టర్ కథ ఇదీ
లోక్ సభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత గంటి జీఎంసీ బాలయోగి 2002, మార్చి 3న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. భీమవరం నుంచి వెళ్తుండగా హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి హెలికాప్టర్ కిందికి దూసుకొచ్చింది. అందులో ఉన్న ఆయన చనిపోయారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం హెలికాప్టర్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. ‘రచ్చబండ’ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వెళ్లగా హెలికాప్టర్ నల్లమల అడవుల్లోని పావురాల గుట్టలో కూలిపోయింది. దాంతో అందులో ఉన్న వైఎస్ఆర్, ఇంకా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Army Helicopter: బిపిన్ రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదంపై విచారణకు ఆదేశం.. కొనసాగుతున్న ఉత్కంఠ.!