spot_img
Homeజాతీయ వార్తలుBipin Rawat: 5 నిమిషాల్లో ల్యాండింగ్.. బిపిన్ రావత్ ఎక్కడికి వెళ్తున్నారు.. ఎలా చనిపోయారంటే?

Bipin Rawat: 5 నిమిషాల్లో ల్యాండింగ్.. బిపిన్ రావత్ ఎక్కడికి వెళ్తున్నారు.. ఎలా చనిపోయారంటే?

Bipin Rawat: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ బుధవారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తమిళనాడులోని కూనూరు సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. వెల్లింగ్టన్ లోని మిలిటరీ కాలేజీలో ఉపన్యాసం ఇచ్చేందుకు బయలుదేరిన ఆయన గమ్యం చేరకముందే అనంతవాయువుల్లో కలిసిపోయినట్లు తెలుస్తోంది. ఆయన పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేకపోయినా అందరు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ ప్రమాదానికి గురికావడం ఆందోళనకరమే.

Bipin Rawat
Bipin Rawat

బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిక రావత్ ఉన్నతాధికారులతో ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆర్మీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి  తమిళనాడు బయలుదేరారు. సూలురు నుంచి హెలిక్యాప్టర్ నుంచి వెళుతుండగా అంతా సవ్యంగా సాగితే ఐదు నిమిషాల్లో ల్యాండ్ అవుతారనే సమయంలో హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. ముందుగా ఓ నలుగురు అందులోనుంచి జారి పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే 13 మంది మృతదేహాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. డీఎన్ఏ ద్వారా మృతులను గుర్తిస్తున్నట్లు చెబుతున్నారు.

హెలికాప్టర్ మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో కట్టేరీలోని సంచప్ప చత్రం ప్రాంతంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. మరో 5 నిమిషాల్లో ల్యాండింగ్ కాబోతుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని  అధికారులు  తెలిపారు.. బిపిన్ రావత్ కూడా ప్రమాదంలో మరణించారు.అటవీ ప్రాంతం కావడంతో సహాయక చర్యలు కొంత ఆలస్యమైనట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు అందరి మృతదేహాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.

Also Read: Bipin Rawat: బిపిన్ రావత్ మరణానికి కారణమైన హెలిక్యాప్టర్ కథ ఇదీ

గ్రూప్ కెప్టెన్ మాత్రం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు వాయుసేన ప్రకటించింది. హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడంపై అందరు ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు నీలగిరి జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. తమిళనాడులోని కూనూరు సమీపంలో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

Also Read: Army Helicopter: బిపిన్ రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదంపై విచారణకు ఆదేశం.. కొనసాగుతున్న ఉత్కంఠ.!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
Oktelugu Epaper
Exit mobile version