Chief Minister Stalin
Chief Minister Stalin : మన దేశానికి వస్తే దక్షిణ భారతదేశంలో జనాభా సంక్షోభం ఉంది. అందువల్లే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిల్లల్ని కనాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. వీలైనంతమంది ఎక్కువ పిల్లల్ని కంటే బాగుంటుందని.. వినియోగదారుల మార్కెట్ పెరిగి రాష్ట్రాలు బాగుపడతాయని చెబుతున్నారు. జనాభా ఎక్కువగా ఉండటం వల్లే ఉత్తర భారత దేశంలో పార్లమెంటు స్థానాలు ఎక్కువగా ఉన్నాయని.. ఆ రాష్ట్రాలకు చెందిన నాయకులే దేశాన్ని పరిపాలిస్తున్నారని వారు చెబుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్న నేపథ్యంలో పార్లమెంటు స్థానాల గురించి మాట్లాడకపోయినప్పటికీ.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం నేరుగా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. త్వరలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో స్టాలిన్ పార్లమెంటు స్థానాలు, హిందీ వ్యతిరేక అంశాలను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానానికి వ్యతిరేకంగా డీఎంకే కార్యకర్తలు అక్కడ ఉద్యమం చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంపై హిందీని బలవంతంగా రుద్దకూడదని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై హిందీతో రాసిన అక్షరాలను నలుపు రంగుతో తుడిచివేస్తున్నారు.
Also Read : పెయింట్ తో అద్భుతం చేశాడు.. ఉద్యోగి నుంచి కంపెనీ సీఈవోగా ఎదిగాడు.. స్ఫూర్తినిచ్చే స్టోరీ
పిల్లల్ని కనాలి
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి అధికారం దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమ ప్రభుత్వం చేసిన తప్పులను డైవర్ట్ చేయడానికి తెలివిగా జాతీయ అంశాలను ఎంచుకుంటున్నారు.. రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతున్న నేపథ్యంలో.. వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని.. అప్పుడే దక్షిణ భారత దేశంలో తమిళనాడు కీలకంగా ఉంటుందని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో జరిగిన ఓ సభలో స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.”గతంలో కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేశాం. ఇప్పుడు పిల్లల్ని కనాలని పిలుపునిస్తున్నాం. అందువల్లే ప్రజలు నా మాట వినడానికి కోరుతున్నామని” స్టాలిన్ పేర్కొన్నారు.. స్టాలిన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బిజెపి, ఇతర పార్టీలు భిన్నంగా స్పందిస్తున్నాయి. “డీఎంకే ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక కుంభకోణాలు జరిగాయి. ఇప్పుడు ఎన్నికల్లో ఆ విషయం బయటపడుతుందని స్టాలిన్ భయపడుతున్నారు. అందువల్లే డైవర్ట్ పాలిటిక్స్ కు తెర తీశారు. ఇప్పటికే డిఎంకె నేతలపై ఈడీ కేసులు నమోదు చేసింది. అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదు చేసింది. అవినీతి మరకలను తుడిచి వేసుకునే ధైర్యం లేక స్టాలిన్ ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు మొత్తం తెలుసని” బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు.
Also Read : రోహిత్‌శర్మపై నోరు జారిన కాంగ్రెస్ నాయకురాలు.. నెట్టింట ఆటాడుకుంటున్న ఫ్యాన్స్!
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Chief minister stalin tamil nadu chief minister stalin urges people to have children
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com