Rohit Sharma: భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ(Rohith Sharma)పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లావుగా ఉంటాడని, అతడి ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకునేలా ఉండదు అని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఆకట్టుకోలేని కెప్టెన్ అతడే. బరువు తగ్గాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొంది. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. షమా వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు రోహిత్ ప్యాన్స్ షమాను ఆటాడుకుంటున్నారు. బీజేపీ(BJP) నేతలు కూడా రోహిత్‌కు అండగా నిలవడంతో రాజకీయరంగు పులుముకున్నాయి. మార్చి 2న భారత్–న్యూజిలాండ్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా శమా మొహమ్మద్ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. రోహిత్ శర్మను ‘క్రీడాకారుడిగా లావుగా ఉన్నాడు‘ (fat for a sportsman) అని, ‘బరువు తగ్గాలి‘ (needs to lose weight) అని, ‘భారతదేశం చూసిన అత్యంత నీరసమైన కెప్టెన్‘ (most unimpressive captain) అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రోహిత్ శర్మ అభిమానులు మరియు బీజేపీ నాయకుల నుండి తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించాయి.
Also Read: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. ముగిసిన లీగ్ మ్యాచ్‌లు.. నాకౌట్ షెడ్యూల్ ఇదీ.. వేదికలు, టైమింగ్స్..
వివాదం ఇలా..
షమా మొహమ్మద్ తన పోస్ట్‌లో రోహిత్ శర్మను గత కెప్టెన్సీ చేసిన సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్ వంటి వారితో పోల్చి, ‘వీరితో పోలిస్తే రోహిత్‌లో ప్రపంచ స్థాయి ఏమీ లేదు, అతను సాధారణ కెప్టెన్, సాధారణ ఆటగాడు, అదృష్టవశాత్తూ కెప్టెన్ అయ్యాడు‘ అని ఎక్స్‌లో పోస్టు చేశాశారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రోహిత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని నాయకత్వంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ (2024) గెలుచుకోవడం, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఐదుసార్లు టైటిల్ అందించడం వంటి విజయాలను గుర్తు చేశారు.
బీజేపీ కౌంటర్
బీజేపీ నాయకులు షమా వ్యాఖ్యలను ‘బాడీ షేమింగ్‘గా విమర్శించారు. బీజేపీ ప్రవక్త షెహజాద్ పూనావాలా, ‘రాహుల్ గాంధీ నాయకత్వంలో 90 ఎన్నికల్లో ఓడిన వారు రోహిత్ శర్మ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ కంటే 90 ఓటములు గొప్పవా?‘ అని ప్రశ్నించారు. రాధికా ఖేరా అనే బీజేపీ నాయకురాలు, ‘కాంగ్రెస్ దశాబ్దాలుగా క్రీడాకారులను అవమానిస్తోంది, ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్‌ను విమర్శిస్తోంది‘ అని ఆరోపించారు.
కాంగ్రెస్ స్పందన..
వివాదం తీవ్రతరం కావడంతో కాంగ్రెస్ పార్టీ షమా మొహమ్మద్(Shama Mohmad) వ్యాఖ్యల నుండి దూరం జరిగింది. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా మార్చి 3న ఎక్స్‌లో ఒక ప్రకటన విడుదల చేసి, ‘షమా మొహమ్మద్ చేసిన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయాన్ని ప్రతిబింబించవు. ఆమెను ఆ పోస్ట్‌లను తొలగించమని, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని సూచించాం. కాంగ్రెస్ క్రీడా హీరోల సహకారాన్ని గౌరవిస్తుంది‘ అని తెలిపారు. దీంతో షమా తన పోస్ట్‌ను తొలగించారు.
షమా వాదన ఇలా..
విమర్శల నేపథ్యంలో షమా మొహమ్మద్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘నా వ్యాఖ్యలు క్రీడాకారుల ఫిట్‌నెస్ గురించి సాధారణంగా చేసినవి, బాడీ షేమింగ్ కాదు. రోహిత్ కొంచెం బరువుగా ఉన్నాడని భావించాను. ఇది ప్రజాస్వామ్యం, నాకు మాట్లాడే హక్కు ఉంది‘ అని ఆమె వాదించారు.
ఈ సంఘటన రాజకీయ, క్రీడా రంగాల మధ్య చర్చనీయాంశంగా మారింది, రోహిత్ శర్మ అభిమానులు, రాజకీయ నాయకుల మధ్య సోషల్ మీడియాలో వాదనలు కొనసాగుతున్నాయి.
Also Read: ఇండియా–న్యూజిలాండ్ మ్యాచ్.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన్ హాట్ బ్యూటీ.. ఎవరో తెలుసా?