Kiran Abbavaram : యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఫాలోయింగ్ ని తెచ్చుకున్న హీరోలలో ఒకరు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఒక సాధారణ కుర్రాడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం, మొదటి సినిమా ‘రాజా వారు..రాణి వారు’ తోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఆ చిత్రం తర్వాత ఈయన చేసిన ‘SR కళ్యాణ మండపం’ కూడా పెద్ద హిట్ అయ్యింది. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి, ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నాడు అంటూ వెక్కిరింపులు కూడా వచ్చాయి కానీ, వాటిని విజయవంతంగా ఎదురుకొని ముందుకు వెళ్ళాడు. వరుస ఫ్లాప్స్ తర్వాత తనలో లోపాలను గుర్తించి ఎవ్వరూ ముట్టుకొని కాన్సెప్ట్ తో ‘క’ చిత్రాన్ని చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ కి గురయ్యారు.
Also Read : బైక్ గిఫ్ట్ గా ఇస్తా… హీరో కిరణ్ అబ్బవరం క్రేజీ ఆఫర్, ఇలా చేస్తే చాలు, అది మీ సొంతం!
ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి ఫ్యూజులు ఎగిరేంత పని అయ్యింది ఆడియన్స్ కి. అలాంటి సినిమా ని తీసిన తర్వాత కిరణ్ అబ్బవరం నుండీ రాబోతున్న చిత్రం ‘దిల్ రూబా'(Dil Ruba Movie). మార్చి 14 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై కూడా కిరణ్ అబ్బవరం భారీ ఆశలు పెట్టుకున్నాడు. తన ప్రతీ సినిమా విడుదలకు ముందు ప్రొమోషన్స్ విషయం లో ఎంతో శ్రద్ద ని చూపించే కిరణ్ అబ్బవరం, ఈ సినిమాకి కూడా విన్నూతనమైన ప్రొమోషన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా కథ ఏంటో ఊహించి సరిగ్గా చెప్పిన వాళ్లకు నేను సినిమాలో వాడిన బైక్ ని ఉచితంగా ఇచ్చేస్తాను అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ మాటలు సినిమా గురించి ఆడియన్స్ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేసింది. సోషల్ మీడియా లో బోలెడంత పబ్లిసిటీ దొరికింది.
ఇకపోతే రీసెంట్ గానే ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ మూవీ స్టోరీ లైన్ ని వినిపించాడు. మాజీ ప్రియుడికి దగ్గరుండి పెళ్లి చేసే ప్రేయసి కథ ఇది అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఆసక్తి రేపింది. స్టోరీ ఇప్పటి వరకు ఎక్కడా చూసినట్టు గాని, విన్నట్టు గాని అనిపించడం లేదు కదూ?, ఈ కాన్సెప్ట్ ని డైరెక్టర్ పర్ఫెక్ట్ గా తీసి ఉంటే కిరణ్ అబ్బవరం మరోసారి కుంభస్థలాన్ని బద్దలు కొట్టినట్టే అనుకోవచ్చు. ఇలాగే పాత్ బ్రేకింగ్ సినిమాలు తీస్తూ పోతే కిరణ్ అబ్బవరం మరో నాని స్థాయి హీరో అవుతాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమా నుండి విడుదలైన ఒక్క పాట కూడా సరిగా క్లిక్ అవ్వలేదు. ఈమధ్య కాలంలో పాటలు బాగుంటే సినిమాల బాక్స్ ఆఫీస్ రేంజ్ వేరే లెవెల్ లో ఉంటున్నాయి. ‘తండేల్’ చిత్రం అందుకు మరో ఉదాహరణ. ‘దిల్ రూబా’ కి పాటలు క్లిక్ అవ్వకపోవడం తో కావాల్సిన హైప్ క్రియేట్ అవ్వలేదు.
Also Read : బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయిన కిరణ్ అబ్బవరం..మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకడం కష్టమే..అసలు ఏమైందంటే!