Special Story : పెయింటింగ్‌లు గోడలకు అందాన్ని అందిస్తాయి. కాకపోతే అవి కొంతకాలం మాత్రమే నిలుస్తాయి. ఐదేళ్లు లేదా ఆరేళ్ల తర్వాత ఎండాకాలంలో గోడలకు క్రాక్స్ రావడం, భారీ వర్షాల సమయంలో పెయింటింగ్ పెచ్చుల్లా రాలిపోవడం సాధారణం. కానీ ఈ ఇబ్బందికి పరిష్కారం కనుగొన్నాడు ఓ యువకుడు. సరికొత్త నాణ్యత కలిగిన పెయింట్‌ను ఆవిష్కరించాడు.
ఈ యువకుడు చిన్నస్థాయి ఉద్యోగి గా తన ప్రయాణం ప్రారంభించి..ఇప్పుడు ఓ కంపెనీ అధిపతిగా ఎదిగారు. తన ఆవిష్కరణతో గోడపై పెయింటింగ్‌లు ఎక్కువకాలం నిలిచేలా, మన్నికతో కూడిన కొత్త పెయింట్‌ను అందించాడు. ఈ ఆవిష్కరణకు అతను ఎన్నో అవార్డులు పొందారు. పెయింటింగ్ రంగంలో ఈ సరికొత్త ఆవిష్కరణ ద్వారా గృహాల నుంచి కార్యాలయాలు వరకు గోడలకు దీర్ఘకాలిక పరిష్కారం అందుబాటులోకి వచ్చింది.
ప్రకాశం జిల్లా గంగవరానికి చెందిన షేక్ మస్తాన్ వలీ ట్రిపుల్ ఈ చేశారు. ఎలక్ట్రికల్ భవన నిర్వహణ ఉద్యోగిగా పనిచేశారు. ఏ పరిశ్రమలో చూసినా గోడలకు వేసిన రంగులు ఎప్పటికప్పుడు ఊడిపోయేవి. ఎంతో ఖరీదైన నాణ్యమైన పెయింటింగ్స్ వేసినా మళ్లీ మొదటికే రావడంతో ఆయనలో ఆలోచన మొదలైంది. దీనికి కారణం పెయింటింగ్ లోపం కాదు. నిర్మాణ సమయంలో గోడలకు సరిగ్గా క్యూరింగ్ చేయకపోవడంతో గోడలు పటుత్వం కోల్పోయి పగుళ్లు ఏర్పడుతాయి. వర్షాలు పడ్డపుడు ఆ పగుళ్లలోకి నీరు చేరి ఫంగస్ ఏర్పడి అనారోగ్యానికి కారణం అవుతుంది. వాటర్ ఫ్రూవ్ పెయింటింగ్ తో ఈ సమస్యకు ముగింపు పలకవచ్చని మస్తాన్ భావించారు.
Also Read : స్పెషల్ స్టోరీ: చరిత్రలో విధించిన 5 అతి దారుణ శిక్షలు…
డెక్కన్ క్లాప్ అనే సంస్థను నెలకొల్పారు.డెక్కన్ క్లాప్ ద్వారా పెయింటర్లను వారికి పెయింటర్ కమ్ వాటర్ ఫ్రూప్ ఎక్స్ ఫర్ట్ గా తర్ఫీదును ఇచ్చారు.ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏషియన్ పెయింట్స్ తో సంప్రదించి సూచనలు చేశారు. మస్తాన్ సూచనలు నచ్చడంతో ఏషియన్ పెయింట్స్ అంగీకరించి డామ్ ప్రూఫ్ ఆల్ట్రా ఉత్పత్తిని తీసుకుని వచ్చింది.డెక్కన్ క్లాప్ ద్వారా గోడలకు పెయింట్ వేయడం వల్ల పదేళ్ల వరకు గోడలకు రంగులు ఊడిపోవని మస్తాన్ చెబుతున్నారు.ఇండియాలోనే మొట్ట మొదటి సారిగా పెయింటింగ్ కమ్ వాటర్ ప్రూఫింగ్ సర్వీసింగ్ కంపెనీని స్థాపించారు మస్తాన్. దీని వల్ల వినియోగదారులకు 50శాతం కంటే ఎక్కువ డబ్బులు ఆదా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 30వేలకు పైగా ఇళ్లకు తమ సర్వీసు ఇచ్చినట్లు ఆయన చెప్పారు.
Also Read : విలక్షణ మోడీ : అడవిలో యాత్రికుడు, హిమాలయాల్లో శివ భక్తుడు, విదేశాల్లో భారతీయుడు