Homeఆంధ్రప్రదేశ్‌అమిత్ షా ముందు జగన్ కోరికల చిట్టా ఇదీ

అమిత్ షా ముందు జగన్ కోరికల చిట్టా ఇదీ

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం వైయస్‌.జగన్‌ భేటి అయ్యారు. న్యూఢిల్లీలోని అమిత్‌షా నివాసంలో ఈ సమావేశం జరిగింది. 1 గంటా 35 నిమిషాలకుపైగా సాగిన సమావేశంలో దీనిపై ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను హోంమంత్రి అమిత్‌షా దృష్టికి ముఖ్యమంత్రి తీసుకు వచ్చారు.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాలమధ్య సమతుల్యతో కూడిన అభివృద్ధికి, అభివృద్ది వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్‌షాకు తెలియజేసిన ముఖ్యమంత్రి. దీంట్లో భాగంగానే రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరిస్తూ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును చేస్తూ ప్రణాళిక వేసుకున్నామని తెలిపారు. ఆగస్టు 2020న దీనికి సంబంధించి చట్టాన్నికూడా తీసుకొచ్చామని వివరించారు. కర్నూలు హైకోర్టును పెడుతూ రీ నోటిఫికేషన్‌ జారీచేయాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు అంశాన్ని బీజేపీ కూడా పెట్టిందని గుర్తుచేశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తిచేశారు. విభజన తర్వాత ఏర్పడ్డ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కారణంగా రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని తెలిపారు. రాష్ట్రాన్ని బలోపేతం చేయాలని, అనేక రంగాల్లో స్వయం సమృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వడంద్వారా కేంద్ర గ్రాంట్లు అధికంగా రాష్ట్రానికి వస్తాయని, ఆర్థిక భారం తగ్గుతుందని వెల్లడించిన సీఎం. భారీగా పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాల కల్పన జరగాలన్నా ప్రత్యేక హోదా చాలా అవసరమని తెలిపిన సీఎం. ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోమారు విజ్ఞప్తిచేసిన సీఎం.

కొత్తగా నిర్మించనున్న మెడికల్‌కాలేజీలకు మంజూరు, అనుమతులు ఇవ్వాలని అమిత్ షాను సీఎం జగన్ కోరారు.. రాష్ట్రంలోని ప్రజలందరికీ అందుబాటులో మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలను అందించడానికి ప్రభుత్వం చర్యలను ప్రారంభించిందని, రాష్ట్ర విభజన తర్వాత, ఏపీలో మహానగరాలు లేవని, అందుకనే కొత్తగా 13 మెడికల్‌కాలేజీల నిర్మాణాన్ని మొదలుపెడుతున్నామని, దీంతోపాటు ఇప్పుడున్న మెడికల్‌కాలేజీలను అభివృద్దిచేస్తున్నామని తెలిపిన సీఎం. దీనివల్ల ప్రభుత్వరంగంలో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, గ్రామీణ, సబ్‌ అర్బన్‌ ప్రాంతాల్లోని ప్రజలకు మంచి ప్రయోజనం చేకూరుతుందని వివరించిన సీఎం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 3 కాలేజీలకు మంజూరు, అనుమతి ఇచ్చిందని, దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, మిగిలిన కాలేజీలకూ అనుమతులు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్నికోరామని, మెడికల్‌కాలేజీలతోపాటు నర్సింగ్‌కాలేజీలకు అనుమతులు ఇచ్చి, తగిన ఆర్థిక సహాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా బియ్యం సబ్సిడీ కింద రాష్ట్రప్రభుత్వానికి చెందిన సివిల్‌ సప్లైస్‌కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 3,229 కోట్ల బకాయిలను వెంటనే విడుదలచేయాలని, ఈ మేరకు సంబంధిత శాఖపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు.

గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.4,652.70 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉందని, వెంటనే ఈడబ్బును చెల్లించేలా చూడాలని కోరిన సీఎం. అలాగే సంవత్సరంలో పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలని సీఎం కోరారు.. స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రావాల్సిన రూ. 529.95 కోట్ల బకాయిలు ఉన్నాయని, అలాగే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన మరో రూ.497 కోట్లు కూడా పెండింగులో ఉన్నాయని, వీటిని వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరిన ముఖ్యమంత్రి.

విద్యుత్‌ సంస్కరణల్లో రాష్ట్రం ముందంజలో ఉందని, అలాగే సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలోకూడా ముందంజలో ఉందని తెలిపిన సీఎం. కాని రాష్ట్ర విద్యుత్‌రంగ ఆర్థిక పరిస్థితి బాగోలేదని వివరించిన సీఎం. ఏపీకి తగిన సహాయం చేస్తానని కేంద్ర విద్యుత్‌శాఖ చెప్పిందని గుర్తుచేసిన ముఖ్యమంత్రి. కుడిగి మరియు వల్లూరు థర్మల్‌ ప్లాంట్లనుంచి అధిక ధరకు కొనుగోలుచేస్తున్న విద్యుత్‌ను సరెండర్‌ చేసే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరిన సీఎం. ఈ విద్యుత్‌ ప్లాంట్ల నుంచి కరెంటు కొనుగోలు ధర చాలా అధికంగా ఉందని, 300 మెగావాట్ల కరెంటు కొనుగోలుపై ఏటా రూ.325 కోట్ల ఫిక్స్‌డ్‌ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని, ఇప్పటికే ఆర్థిక భారంతో నడుస్తున్న డిస్కంలకు ఇది చాలా భారమని తెలిపిన సీఎం. ఏపీ–డిస్కంలు ఈ రెండు ప్లాంట్లనుంచి 40 ఏళ్లపాటు కరెంటు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో…. సరెండర్‌ కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరిన ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ డిస్కంలనుంచి రూ.5,541.78 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ద్వారా తెలంగాణ డిస్కంలకు తగిన రుణసదుపాయాలను కల్పించి, తద్వారా ఏపీ జెన్‌కోకు సెంట్రల్‌ డివల్యూషన్‌ నుంచి ఆ డబ్బు వచ్చేలా చూడాలన్న సీఎం.

రాష్ట్ర విద్యుత్‌ రంగం దాదాపు రూ. 50వేల కోట్ల అప్పుల్లో ఉందని, ఈ రుణాలను రీ స్ట్రక్చర్‌ చేయాలని అమిత్ షాను జగన్ కోరారు. విశాఖ జిల్లా అప్పర్‌ సీలేరులో రివర్స్‌పంప్‌ స్టోరేజీ విద్యుత్‌ పాజెక్టుకు ఆర్థిక సహాయం చేయాలని కోరిన సీఎం. 1,350 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ఈ ప్రాజెక్టుకు రూ. 10,445 కోట్ల ఖర్చు అవుతుందని తెలిపిన సీఎం. కేంద్రం 30శాతం నిధులను సమకూర్చాలని, త్వరతిగతిన పర్యావరణ అనుమతులు వచ్చేలా చూడాలని కోరిన సీఎం.

దిశ బిల్లుకు వెంటనే ఆమోదం తెలిపేలా చూడాలని అమిత్ షాను సీఎం జగన్ కోరారు. . ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లు –2020కి ఆమోదం తెలిపేలా చూడాలని కోరిన సీఎం.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూముల రీ సర్వే ప్రారంభించామని, అన్ని రికార్డులను డిజిటలైజ్‌ చేస్తున్నామని తెలిపిన సీఎం. వెంటనే ఈబిల్లుకు ఆమోదం తెలిపేలా చూడాలన్న ముఖ్యమంత్రి.. విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో 250 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని వెంటనే యూనివర్శిటీని ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం జగన్ కోరారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version