ఆన్ లైన్ మోసాలకు అడ్డుకట్ట పడేనా?

దేశంలో ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించుకుని హాకర్లు రెచ్చిపోతున్నారు.ఫలితంగా అమాయకులు బలైపోతున్నారు. టెక్నాలజీ పెరిగిందని సంతోష పడాలో మోసాలతో బాధపడాలో తెలియని వింత పరిస్థితి. ప్రతి రోజు ఏదో ఒక చోట ఆన్ లైన్ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అత్యాశకు పోయి అడ్డంగా దొరికిపోతున్నారు. మీకు లాటరీ తగిలింది అనగానే నమ్మి వారికి అన్ని వివరాలు తెలియజేస్తున్నారు.తేరుకునే లోపే ఖాతాలోని డబ్బు మాయం అవుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాలని పోలీసు శాఖసైతం […]

Written By: Srinivas, Updated On : June 11, 2021 3:50 pm
Follow us on

దేశంలో ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించుకుని హాకర్లు రెచ్చిపోతున్నారు.ఫలితంగా అమాయకులు బలైపోతున్నారు. టెక్నాలజీ పెరిగిందని సంతోష పడాలో మోసాలతో బాధపడాలో తెలియని వింత పరిస్థితి. ప్రతి రోజు ఏదో ఒక చోట ఆన్ లైన్ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అత్యాశకు పోయి అడ్డంగా దొరికిపోతున్నారు. మీకు లాటరీ తగిలింది అనగానే నమ్మి వారికి అన్ని వివరాలు తెలియజేస్తున్నారు.తేరుకునే లోపే ఖాతాలోని డబ్బు మాయం అవుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాలని పోలీసు శాఖసైతం వినూత్నంగా ఆలోచిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఆన్ లైన్ మోసాలు రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల కాలంలో బ్లాక్ మెయిల్ లు, హనీ ట్రాప్ లు పెరిగిపోతున్నాయి. నగ్న వీడియోలను రికార్డు చేసి బ్లాక్ మెయిల్ కు దిగుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు పోలీసులు, మీడియా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నా కొందరు కక్కుర్తి పడి అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సైబరాబాద్ పోలీసులు ఇలాంటి మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు.

హైదరాబాద్ పోలీసులు ప్రజలను చైతన్యవంతులను చేసే క్రమంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆన్ లైన్ వేదికగా అమ్మాయి అంటూ పరిచయం చేసుకుని చేస్తున్న మోసాలకు సంబంధించి అవగాహన కోసం ట్విటర్ వేదికగా ఓ పోస్టు చేశారు. ఫేస్ బుక్, వాట్సాప్ లలో మగవారిని ప్రేరేపించి వారిని బుట్టలో వేసుకుని అనంతరం వారిని బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి అందింత డబ్బు గుంజడమే తరువాయి. వీటిపై పోలీసులు తమదైన శైలిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆన్ లైన్ లో మీకు లాటరీ తగిలిందని సందేశాలు పంపిస్తున్నారు. దీంతో వారు ప్రలోభాలకు గురై వివరాలు అన్ని చెప్పేస్తున్నారు. ఫలితంగా నిమిషాల్లో బ్యాంకు లోని డబ్బు మాయం అవుతోంది. దీనిపై కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పరిచయం లేని వారికి వివరాలు తెలపకూడదని చెబుతున్నారు. ఒకవేళ చెబితే తక్షణమే మోసానికి గురవుతారని వివరించారు. ప్రజలు నిరంతరం అప్రమత్తమై ఉండాలని చెప్పారు.