సినిమా ఇండస్ట్రీలో ఏ జోనర్ లో అయితే భారీ హిట్ వస్తోందో.. ఇక మిగిలిన వాళ్ళంతా ఆ జోనర్ మీదే పడతారు. ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తోంది. ఈ క్రమంలో భారీ అంచనాలతో వచ్చిన ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్ బాగా క్లిక్ అయి సూపర్ హిట్ అయింది. దాంతో సినిమా వాళ్ళ చూపులు అన్నీ ఇప్పుడు ఓటీటీల వైపు వెబ్ సిరీస్ ల వైపు పడింది.
సీనియర్ హీరోలు చాలామందికి థియేటర్ బిజినెస్ లేదు. వాళ్లకు ఓటీటీలోనే భవిష్యత్తు కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీలో కూడా బాగానే డబ్బులు వస్తున్నాయి. అందుకే, స్టార్ హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ ల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా ‘ఫ్యామిలీ మెన్’ సిరీస్ లో రాజీ అనే పాత్రలో సమంత అదరగొట్టడం, అదే విధంగా ఈ పాత్ర పై తమిళ సమాజం విరుచుకుపడటం, మొత్తానికి ఈ సిరీస్ కి ఫ్రీ పబ్లిసిటీ దక్కి నాలుగు వ్యూస్ ఎక్కువ వచ్చాయి.
దాంతో హిందీ వెబ్ సిరీస్ ల కోసం మేకర్స్ ఇప్పుడు సౌత్ హీరోయిన్ల పై పడ్డారు. హిందీ సిరీస్ ల కోసం కూడా సౌత్ భామలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో త్వరలోనే మొదలు కానున్న ఓ హిందీ వెబ్ సిరీస్ లో రాశి ఖన్నా నటించనుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందనున్న ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ ని బీబీసీ స్టూడియో భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
‘లూథర్’ అనే ఇంటెర్నేషనల్ వెబ్ సిరీస్ కి, ఈ సిరీస్ రీమేక్ అని తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ లో అజయ్ దేవగన్ వెరీ సీరియస్ గా ఉండే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ సిరీస్ లో హీరోయిన్ గా నటిస్తోన్న ‘రాశి ఖన్నా’ కూడా పోలీస్ అధికారిణిగానే కనిపించబోతుంది. మొత్తానికి రాశి ఖన్నా కూడా సమంతను ఫాలో అవుతూ వెబ్ సిరీస్ లతో బిజీ అవుతోంది.