కాపు ఉద్యమ పగ్గాలు చేపట్టిన చేగొండి..!

రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కాపు ఉద్యమం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేగొండి హరిరామజోగయ్య ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. గతంలో కాపు ఉద్యమానికి నాయకత్వం వహించిన ముద్రగడ పద్మనాభం ఇటీవల ఆ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కొందరు తనపై చేస్తున్న ఆరోపణకు మనస్తాపం చెందడంతో ఉద్యమం నుంచి దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. దీంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సీనియర్ రాజకీయ […]

Written By: Neelambaram, Updated On : August 12, 2020 1:15 pm
Follow us on


రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కాపు ఉద్యమం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేగొండి హరిరామజోగయ్య ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. గతంలో కాపు ఉద్యమానికి నాయకత్వం వహించిన ముద్రగడ పద్మనాభం ఇటీవల ఆ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కొందరు తనపై చేస్తున్న ఆరోపణకు మనస్తాపం చెందడంతో ఉద్యమం నుంచి దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. దీంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సీనియర్ రాజకీయ నాయకులైన చేగొండి హరిరామ జోగయ్య రంగంలోకి దిగారు. కాపు సంక్షేమ సేన పేరుతో ఒక సంస్థను స్ధాపించడం పూర్తి చేశారు.

Also Read: రాపాక మనసులో మాట ఇదే..!

కాపు సంక్షేమ సేనలో అన్నిపార్టీలు, వివిధ వృత్తులకు చెందిన ప్రముఖులకు అవకాశం కల్పించారు. ప్రధానంగా కాపు రిజర్వేషన్ ల సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధం అవతున్నారు. సిఎం జగన్ కాపు రిజర్వేషన్ ల అంశం కేంద్రం పరిధిలోనే ఉందని పక్కన పెట్టేశారు. గత టిడిపి ప్రభుత్వం ఈబీసీ కోటాలో 5 శాతం కాపులకు కేటాయించినా అమలు జరగడం లేదు. కాపులకు రిజర్వేషన్ లకు సంబందించి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింనా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా లేదు. దీంతో హరి రామ జోగయ్య నేతృత్వంలోని కాపు సంక్షేమ సేన ఈ వ్యవహారంపై పోరాటం చేపట్టనుంది.

Also Read: రాజధాని రగడ లో బిజెపి పాత్ర

గతంలో కాపు ఉద్యమానికి రాజకీయ ముద్ర పడింది. ముద్రగడ పద్మనాభం అప్పటి ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్ పోద్భలంతోనే కాపు ఉద్యమాన్ని పున: ప్రారంభించారని టిడిపి ప్రభుత్వం విమర్శలు చేసింది. తుని రైలు దహనం ఘటనలో వైసీపీ గుండాలు ఉన్నట్లు ఆరోపించింది. పలు జిల్లాల్లోని కాపునేతలపై కేసులు పెట్టింది. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ఆ కేసులను కోట్టి వేసింది. జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం ముద్రగడ సైలెంట్ అయిపోవడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన ఉద్యమం నుంచి తప్పుకున్నారు. తాజాగా కాపు ఉద్యమాన్నితలకెత్తుకున్న సీనియర్ రాజకీయ నాయకులు హరిరామ జోగయ్య కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ ఏ మేర వత్తిడి తెస్తారో వేచి చూడాలి.