జీతాలు, పెన్షన్ ల కోతపై… వడ్డీ వాత..!

కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జీతాలు, పెన్షన్ ల విషయంలో తీసుకున్న నిర్ణయంపై హై కోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. జీతాలు, పెన్షన్ లలో 50 శాతం కోత విధించిన ఆర్ధిక సమస్యల నుంచి వెసులు బాటు పొందాలనుకున్న ప్రభుత్వానికి, 12 శాతం వడ్డీతో కలిపి కోత విధించిన జీతం, పెన్షన్ లు రెండు నెలల్లో చెల్లించాలని చెప్పడం ప్రస్తుతం ఆర్ధికంగా అదనపు భారంగా పడినట్లయ్యింది. Also Read: రాజధాని రగడ లో బిజెపి పాత్ర మార్చి, ఏప్రిల్ […]

Written By: Neelambaram, Updated On : August 12, 2020 12:22 pm
Follow us on


కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జీతాలు, పెన్షన్ ల విషయంలో తీసుకున్న నిర్ణయంపై హై కోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. జీతాలు, పెన్షన్ లలో 50 శాతం కోత విధించిన ఆర్ధిక సమస్యల నుంచి వెసులు బాటు పొందాలనుకున్న ప్రభుత్వానికి, 12 శాతం వడ్డీతో కలిపి కోత విధించిన జీతం, పెన్షన్ లు రెండు నెలల్లో చెల్లించాలని చెప్పడం ప్రస్తుతం ఆర్ధికంగా అదనపు భారంగా పడినట్లయ్యింది.

Also Read: రాజధాని రగడ లో బిజెపి పాత్ర

మార్చి, ఏప్రిల్ నెలల్లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలులో ఉండటం వల్ల వ్యవస్థలన్నీ స్ధంబించాయి. ప్రభుత్వానికి ఆదాయం బాగా తగ్గిపోయింది. రోజుకు రూ.400 నుంచి 500 కోట్లు మేర వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం లభించాల్సి ఉండగా, మార్చి, ఏప్రిల్ నెలల్లో రోజుకు రూ.30 నుంచి 50 కోట్ల వరకు మాత్రమే ఆదాయం లభించింది. దీంతో ప్రభుత్వం ఉద్యోగులు జీతాలు, పెన్షనర్ల పెన్షన్ చెల్లింపులపై 50 శాతం వరకూ కోత విధించింది. కరోనా వారియర్స్ గా పని చేస్తున్న వైద్యులు, పారిశుధ్య సిబ్బందికి మాత్రం పూర్తి స్థాయి జీతాలు చెల్లించారు.

జీతాల చెల్లింపుల్లో 50 శాతం కోత విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. పెన్షనర్ల పెన్షన్ పై కోత విధించడం దారుణమని ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వానికి లేఖలు రాశాయి. వృద్యాప్యంలో ఉన్న వారికి కోతలు విధించడం సరికాదని హితవు పలికాయి. దీంతో ఏప్రిల్ నుంచి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పెన్షన్ లను అందించింది. మే నుంచి ఉద్యోగులకు జీతాలు పూర్తి స్థాయిలో అందజేశారు. కోత విధించిన జీతాలు త్వరలో చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ అంశాన్ని ప్రస్తుతం పక్కన పెట్టింది.

Also Read: అమ్మా దొంగ.. కేసీఆర్, జగన్ మాస్టర్ ప్లానేనా?

ఈ వ్యవహారంపై రిటైర్డు జిల్లా జడ్జి లక్ష్మీ కామేశ్వరి హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటీషన్ పై విచారించిన హై కోర్టు ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించకుండా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరైన చర్య కాదని పేర్కొంది. పెన్షనర్ల పెన్షన్ లోను కోత విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయస్ధానం ఆదేశాల ప్రకారం కోత విధించిన జీతాలు చెల్లించాలని ఆదేశించింది.