AP power crisis: దేశంలో బొగ్గు సంక్షోభం నానాటికి పెరుగుతోంది. వివిధ స్టేట్లకు ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. బొగ్గు కొరత దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించింది. ఇప్పటికే విద్యుత్ కోతలు మొదలయ్యాయి. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. దాదాపు 20 రేక్ ల బొగ్గు సరఫరా కావాల్సి ఉన్నా అందుకు తగ్గట్లుగా జరగడం లేదు.

బొగ్గు కొరతలపై కేంద్రం ఇప్పటికే పలు స్టేట్లకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినా వినడం లేదు. దీంతో సమస్య జఠిలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సంక్షోభాన్ని తట్టుకోవడమెలా అనే దానిపైనే అన్వేషణలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్ కోతలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి చేయిదాటి పోతే మరింత ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.
రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్ తో విద్యుత్ సంక్షోభం పెరిగిపోతోంది. అవసరమైన బొగ్గు నిల్వలు అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం అవసరాలు తీర్చేలా చర్యలు చేపట్టే విధంగా రాష్ర్ట ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. విద్యుత్ కేంద్రాలకు రోజుకు 20 రైల్వే రేక్ ల బొగ్గు కేటాయించాల్సి ఉన్నా అందుకనుగుణంగా జరగడం లేదు. దీంతో కేంద్రం కూడా ఏం చేయలేని పరిస్థితి ఎదురైంది.
తెలంగాణలో బొగ్గు నిక్షేపాలు ఉన్నందున విద్యుత్ ఉత్పత్తికి ఢోకా లేదని తెలుస్తోంది. ఏపీకి మాత్రం కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. దీశంలోని పలు ప్రాంతాలు కూడా బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తి వెనుకబడిపోతోంది. రాబోయే కాలంలో విద్యుత్ సంక్షోభం ప్రాణసంకటంగా మారనుంది. అయినా ప్రభుత్వం మేలుకోవాలి. సరిపడా బొగ్గును అందుబాటులోకి తీసుకురావాల్సిన అసవరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలి.
Also Read: AP Free Laptop Scheme 2021: ఏపీలో ల్యాప్ టాప్ ల పంపిణీ కి ముహూర్తం ఎప్పుడో?
ఆంధ్రప్రదేశ్ లో సమృద్ధిగా వర్షాలు కురిసిన నేపథ్యంలో జల విద్యుత్ తోనే విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడాలని ఏపీ భావిస్తోంది. దీనికి బొగ్గు కొరతను అధిగమించాలనే ఉద్దేశంతోనే థర్మల్ విద్యుత్ కు పెద్దపీట వేయాలని చూస్తోంది. తద్వారా విద్యుత్ కష్టాలను తీర్చుకోవాలని భావిస్తోంది. కేంద్రం చేసిన సూచనలతో ముందస్తు చర్యలకు ఉపక్రమిస్తోంది.