Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లో అతి ముఖ్యమైన పదవి ఏమిటి అన్నది బిగ్ చూస్తున్న ప్రతి ఒక్క వీక్షకులకు తెల్సిందే.. కెప్టెన్సీ పదవి దక్కితే చాలు దేశానికి ‘రాష్ట్రపతి’ అయ్యినట్టు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫీల్ అయ్యి వీరోచితంగా మరి పోరాడతారు. ఆ పోరాట మహిమ స్వత్రంత సమరం లో చూపిస్తే 1947 కంటే ముందే మనకు స్వాతంత్రం వచ్చేదేమో.

అలా బిగ్ బాస్ ఆరో వారం చివరి దశకి చేరుకుంది. అన్నిటికంటే హోరు – జోరు ఉన్న ‘నామినేషన్ల’ ప్రక్రియ సోమవారానికే అయిపోయింది. దాని తర్వాత వచ్చే కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ మంగళవారం మొదలయ్యింది. బి బి బొమ్మల ఫ్యాక్టరీ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఇంటి సభ్యులని నాలుగు టీమ్స్ గా విభజిస్తాడు. ఎల్లో టీం లో జెస్సి, షణ్ముఖ్, ప్రియాంక సింగ్…… గ్రీన్ టీం లో రవి, లోబో, శ్వేతా వర్మ….. బ్లూ టీం లో అని మాస్టర్, మానస్, సన్నీ…… రెడ్ టీం లో శ్రీరామ చంద్ర, ప్రియా, విశ్వ ఉన్నారు. కాజల్, సిరి సంచాలకులుగా బిగ్ బాస్ నియమించాడు.
గ్రీన్ టీం లో ఉన్న రవి, శ్వేతా , లోబో లకి బిగ్ బాస్ నుండి ఒక స్పెషల్ పవర్ రావడం వల్ల… ఎక్కువ బొమ్మలు కలిగి ఉన్న బ్లూ టీం యొక్క బొమ్మలని గ్రీన్ టీం స్వాధీనం చేసుకుంది. అలా మొత్తానికి ఊహించని పరిణామాల మధ్య బిగ్ బాస్ ఆరో వారం కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ చివరి అంకానికి చేరుకుంది.
బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా రెండోసారి: విశ్వ అంతకుముందే బిగ్ బాస్ రెండో వారం ఇంటి కెప్టెన్ గా నిలిచాడు. మళ్ళీ ఆరో వారానికి గాను బిగ్ బాస్ కెప్టెన్ గా నిలిచి అబ్బురపరిచారు. అంతే కాకుండా, బిగ్ బాస్ మొదటి వారంలో సిరి కెప్టెన్సీ లో రేషన్ మేనేజర్ గా, ఐదవ వారంలో ప్రియా కెప్టెన్సీ లో రేషన్ మేనేజర్ గా అలా … రెండు సార్లు రేషన్ మేనేజర్ గా, రెండు సార్లు ఇంటి కెప్టెన్ గా… విశ్వ బిగ్ బాస్ ఐదో సీజన్ కి గానూ తనకంటూ ఒక రికార్డు ని నెలకొల్పాడు.