Homeజాతీయ వార్తలుBengal Politics: మారుతున్న బెంగాల్‌ రాజకీయాలు.. మమతా బెనర్జీ పుట్టి మునుగుతుందా!

Bengal Politics: మారుతున్న బెంగాల్‌ రాజకీయాలు.. మమతా బెనర్జీ పుట్టి మునుగుతుందా!

Bengal Politics: పశ్చిమ బెంగాల్‌.. 2011 వరకు కమ్యూనిస్టుల కంచుకోట. కానీ కాంగ్రెస్‌ నుంచి విడిపోయి.. సొంత పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ను స్థాపించిన మమతా బెనర్జీ కమ్యూనిస్టుల కంచుకోటను బద్ధలు కొట్టారు. వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ పశ్చిమ బెంగాల్‌పై తన పట్టు నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు తృణమూల్‌ కంచుకోలా మారిన బెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌కు గట్టి పోటీ ఇచ్చింది. మమతా బెనర్జీని ఓడించినా.. మెజారిటీ స్థానాలు సాధించలేదు. కానీ, 2026 అసెంబ్లీలో ఆ పరిస్థితి ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2026 ఎన్నికలకు ముందు బెంగాల్‌లో ప్రత్యేక ఎన్నికల పునర్వీక్షణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ శక్తివంతంగా కొనసాగుతుంది. ఇందులో ఓట్ల జాబితా నుంచి అనేక పేర్లు తొలగించబడ్డాయి, ముఖ్యంగా వలస వచ్చిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, నేపాలీలు ఇలా అనేక మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. అంతేకాకుండా వారంతా దేశం వీడి పారిపోతున్నారు. సర్‌ను అడ్డుకోవడానికి మమతా ప్రభుత్వం నిరోధించడానికి ప్రయత్నించినా ఫలించలేదు.

ఏకమవుతున్న హిందువులు..
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నారు అక్కడి ముస్లింలు. గత ఎన్నికల్లో ముస్లింల ఐక్యతే మమతను గెలిపించింది. దీంతో 2026 నాటికి హిందువులంతా ఏకం కావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో కోల్‌కతాలో బ్రిగేడ్‌ పరేడ్‌ మైదానంలో లక్షల సంఖ్యలో ప్రజలు ఒకసారిగా గీతాపారాయణ ద్వారా హిందూ జననేతలకు ఘన ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ సంఘటన మమతా బెనర్జీలో రాజకీయ భయం కలిగించింది.

తృణమూల్‌లో అంతర్గత విభేదాలు..
ఇదిలా ఉంటే.. అధికార తృణమూల్‌ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉమాయున్‌ కబీర్‌తో మమతా బెనర్జీ మధ్య ఘర్షణలు తీవ్రతరమయ్యాయి. కబీర్‌ ఇటీవల పార్టీ నుంచి బహిష్కృతుడయి, బాబ్రీ మసీదు కడతానని డిసెంబర్‌ 6న ప్రకటించి రాజకీయ వాతావరణాన్ని కలవరపరిచారు. అంతేకాకుండా, ముస్లింలను ఏకం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. డిసెంబర్‌ 22న ఉమాయున్‌ కబీర్‌ తన సొంత పార్టీ ప్రారంభిస్తానని ప్రకటించారు. ఈ వేదిక ద్వారా సెంట్రల్, నార్త్‌ బెంగాల్‌లో ముస్లిం ఓట్లను చీల్చే అవకాశం ఉంది. మజ్లిస్‌ ఇత్తేహాదుల్‌ ముస్లీం లీగ్, ఎంఐఎం, ఐస్‌ఎఫ్‌ వంటి పార్టీలతో కబీర్‌ కలయిక వలన 135 నియోజకవర్గాల్లో అధిక ప్రభావం చూపేందుకు అవకాశం ఉంది. ఇది మమతా బెనర్జీ రాజకీయ ఆధిపత్యాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది.

ఇక బెంగాల్‌లో హిందువులు బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా మమతకు తలనొప్పిగా మారుతోంది. ఇది రాష్ట్రంలో రాజకీయ విభజనలను మరింత తీవ్రతరం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ ఆధిపత్యం బలపడేందుకు వ్యూహాత్మక మార్పులు లేకపోతే 2026 ఎన్నికల్లో ఆమె గెలుపు చాలా కష్టంగా మారుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version