Salaam Bhai: టీమిండియాలో తిలక్ వర్మ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఇటీవల ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుమీద తిలక్ వర్మ ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిలక్ వర్మ ఈ స్థాయిలో ఎదగడానికి ప్రధాన కారణం సలాం బాయాష్. అతడు శిక్షణలో తిలక్ వర్మ అద్భుతమైన ఆటగాడిగా రూపాంతరం చెందాడు. ప్రస్తుతం టీమిండియాలో అత్యంత సమర్థవంతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. తిలక్ వర్మను ఈ స్థాయి దాకా తీసుకువచ్చిన సలాం.. మరికొంతమంది టీమిండియాకు అందించాలని ముందుకెళుతున్నాడు. తాజాగా అతని శిక్షణలో మరో ఇద్దరు అమ్మాయిలు రాటు తేలారు.
సలాం శిక్షణలో అద్భుతమైన ప్లేయర్లుగా పేరు తెచ్చుకున్న చార్వీ లక్ష్మీ శ్రీ, నాగ సాయి అక్షిత త్వరలో నిర్వహించే బీసీసీఐ ఉమెన్స్ అండర్ 19 వన్డే ట్రోఫీకి ఎంపికయ్యారు. లక్నో వేదికగా డిసెంబర్ 13 నుంచి ఈ టోర్నీ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో అండర్ 19 వన్డే ట్రోఫీకి ఎంపికైన లక్ష్మి శ్రీ, నాగ సాయి అక్షితను సలాం అభినందించారు.
కోచ్ సలాం శిక్షణలో లక్ష్మీ శ్రీ, నాగ సాయి అక్షిత కూడా ఆల్ రౌండర్లుగా పేరు తెచ్చుకున్నారు. వారిద్దరిని ఈ స్థాయిలో రాణించడం వెనుక కోచ్ సలాం ఎంతో కృషి చేశాడు. వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చాడు. అందువల్లే లక్ష్మీ శ్రీ, నాగ సాయి అక్షిత ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
లక్ష్మీ శ్రీ, నాగ సాయి అక్షితను లీగాల క్రికెట్ అకాడమీ డైరెక్టర్లు పృథ్వీ రెడ్డి, నవీన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రమేష్ రెడ్డి అభినందించారు. లీగాల క్రికెట్ అకాడమీలో వర్ధమాన క్రికెటర్లు శిక్షణ పొందుతున్నారు. ఈ అకాడమీలో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. అందువల్లే చాలామంది ప్లేయర్లు తమ తొలి ఎంపికగా ఈ అకాడమీ ఎంచుకుంటున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లోనే లీగాల క్రికెట్ అకాడమీకి మంచి పేరుంది. ప్రతిభావంతులైన క్రికెటర్లను లీగాల అకాడమీ అందిస్తోంది. దీని వెనుక కోచ్ సలాం కృషి ఉంది. ప్రస్తుతం ఈ అకాడమీ హైదరాబాద్ లోనే నంబర్ 1 అకాడమీగా కొనసాగుతోంది. దీనివెనుక ప్రధాన వ్యక్తి కోచ్ సలాం . ఆయన శిక్షణలో చాలా మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. లక్ష్మీ శ్రీ, నాగ సాయి అక్షిత లు లక్నోలో జరగబోయే అండర్ 19 టోర్నమెంట్ లో వీరిద్దరూ రాణించాలని మనమూ కోరుకుందాం.