Sukanya Samriddhi Yojana : ఆడపిల్లల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకంను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2015లో అందుబాటులోకి తీసుకొన్ని ఈ పథకం ద్వారా రూ. 10 ఏళ్ల బాలికల నుంచి 21 ఏళ్ల అమ్మాయి వరకు వివిధ అవసరాల నిమిత్తం ప్రభుత్వం డబ్బులు అందిస్తుంది. అయితే ఈ పథకంలో భాగంగా నెలనెలా లేదా, కొంత మొత్తం డబ్బులు డిపాజిట్లు చేయాల్సి ఉంటుంది. రూ. 250 నుంచి రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టొచ్చు. దీంతో ఇప్పటి వరకు చాలా మంది ఆడపిల్లలు ఉన్న వారు ఈ పథకంను తీసుకున్నారు. అయితే వచ్చే అక్టోబర్ 1 నుంచి సుకన్య సమృద్ధి యోజన పథకంలో మార్పులు తీసుకురానున్నారు. ఆ మార్పులు ఏవో తెలుసుకోవాలంటే ఈ కిందికి వెళ్లండి..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకంలో ఇప్పటి వరకు చాలా మంది ఆడపిల్లలను చేర్చారు. అయితే తండ్రి లేదా సంరక్షకుడు కలిసి బాలిక పేరుమీద జాయింట్ గా పోస్టాఫీసులో అకౌంట్ తీసి అందులో సుకన్య సమృద్ధి పథకం ను ప్రారంభించాలి. నెలనెల లేదా ఒకేసారి మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చు. ఈ పథకంలో 15 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టి వదిలేయాలి. ఆ తరువాత ఈ పథకం 21 సంవత్సరా వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అయితే బాలిక 18 సంవత్సరాలు నిండిన తరువాత చదువు కోసం కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు. అలా కాకుంటే మెచ్యూరిటీ పూర్తయిన తరువాత 21 సంవత్సరాలకు డబ్బులు ఇస్తారు.
సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఇప్పటి వరకు ఉన్న నిబంధనల్లో బాలిక తండ్రి లేదా సంరక్షకుడి పేరు మీద అకౌంట్ తీయాల్సి ఉండేది. అయితే చట్టపరంగా బాలికకు తండ్రి లేదా సంరక్షకుడు లేకున్నా ఇతరులు ఖాతా తెరిచేవారు. కానీ ఇక నుంచి అలా కుదరదు. చట్ట పరంగా బాలికకు తండ్రి లేదా సంరక్షకుడు అయితేనే సుకన్య సమృద్ధి యోజనం పథకం ఖాతా కొనసాగుతుంది. ఇది ధ్రువీకరించిన పక్షంలో ఆ ఖాతా మూసివేయబడుతుంది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన ఉండనుంది.
ఇప్పటి వరకు కొందరు బాలిక సంరక్షకులుగా ఖాతాలు తెరిచారు. అయితే ఇందులో కొన్ని లోపాలను గుర్తించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా బాలికకు న్యాయంగా ప్రయోజనాలు కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ నిబంధనను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇక నుంచి కచ్చితంగా బాలికకు చట్టపరమైన సంరక్షుడు అని తేలిన తరువాతే ఈ ఖాతా కొనసాగుతుందని అధికారులు తెలుపుతున్నారు.
సుకన్య సమృద్ధి పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక మార్పులు తీసుకువచ్చారు. అంతకుముందు రూ. 5 సంవత్సరాల బాలికల లోపే నిబంధన ఉండేది. ఆ తరువాత 10 సంవత్సరాలకు పెంచారు. ఈ పథకం కింద బాలిక చదువు, వివాహం కోసం డబ్బును డిపాజిట్ చేస్తారు. అయితే ఈ డబ్బు నిష్ప్రయోజనం కాకుండా బాలికకు మాత్రమే ఉపయోగపడేలా తండ్రి లేదా సంరక్షకుడు భావించాలి. సుకన్య సమృద్ధి పథకం ఖాతా తెరవడం ద్వారా బాలికకు ప్రయోజనాలు కలగనున్నాయి.