Devar Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ పై నిన్నటి నుండి సోషల్ మీడియా లో ఏ విధమైన ట్రోల్స్ నడుస్తున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమా కి సంబంధించిన ట్రైలర్ వచ్చినప్పుడు ఇవన్నీ సర్వసాధారణమే. కానీ ట్రైలర్ కాస్త బాగాలేకపోయిన ట్రోల్స్ మోతాదు ఊహించిన దానికంటే ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ‘దేవర’ చిత్రం పరిస్థితి కూడా అదే. నిన్న సాయంత్రం ఈ ట్రైలర్ ని విడుదల చేసారు. అంచనాలు భారీగానే ఉండేవి, కానీ ఆ అంచనాలకు ట్రైలర్ కనీస స్థాయిలో కూడా రీచ్ అవ్వకపోవడం వల్ల సోషల్ మీడియా లో ఈ విధమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో మెగా మరియు నందమూరి అభిమానుల మధ్య ఏ స్థాయిలో ఫ్యాన్ వార్స్ జరుగుతాయో మన అందరికీ తెలిసిందే. #RRR తర్వాత ఈ గొడవలు ఆగుతుంది అనుకుంటే ఇంకా ఎక్కువైంది. నిన్న ‘దేవర’ చిత్రం ట్రైలర్ పై ఇరు వర్గాలు కనీవినీ ఎరుగని రేంజ్ లో ట్రోల్స్ వేసుకున్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది. గతంలో అల్లు అర్జున్ – కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమాని ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా సముద్రపు బ్యాక్ గ్రౌండ్ తో ఉండడాన్ని మనం గమనించొచ్చు. అంటే అప్పట్లో అల్లు అర్జున్ తో తియ్యాలని అనుకున్న దేవర మూవీ ని ఎన్టీఆర్ తో తీసాడని సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ చాలా తెలివిగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించుకున్నాడని, ‘ఆచార్య’ చిత్రం తర్వాత సైలెంట్ గా పక్కకి తప్పుకున్నాడని, అల్లు అర్జున్ చాలా తెలివైనోడు అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ ఈ సినిమాని మిస్ చేసుకొని తప్పు చేశాడా?, లేదా సరైన నిర్ణయం తీసుకున్నాడా అనేది మరో రెండు వారాల్లో తెలుస్తుంది, అప్పుడే ఎందుకు విష ప్రచారాలు చేయడం?, విడుదల కానీ సినిమా మీద ఈ స్థాయి నెగటివిటీ చూపించడం పద్దతి కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
3 గంటల సినిమాలో కేవలం రెండు నిమిషాల ఫుటేజీని చూసి అంచనా వేయడం తెలివి తక్కువ పని అని, ఇప్పుడు ఇంత ట్రోల్ చేస్తున్నారు, రేపు సినిమా విడుదలై సూపర్ హిట్ అయితే ట్రోల్ చేసిన ప్రతీ ఒక్కరు నవ్వుల పాలు అవ్వక తప్పదని అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. మరి కొరటాల శివ ఎన్టీఆర్ అభిమానులు పెట్టుకున్న ఈ నమ్మకం ని నిలబెట్టుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర ప్రొమోషన్స్ కోసం ముంబై లో ఉన్నాడు. త్వరలోనే ఆయన హృతిక్ రోషన్ తో కలిసి ఒక ఇంటర్వ్యూ లో కనిపించనున్నాడు.