హోమ్ ఐసోలేషన్ లో మార్పులు!

కరోనా చికిత్స తర్వాత అనుసరించే విధానాలపై కేంద్రం హోం శాఖ కొన్ని మార్పులు ప్రకటించింది. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తి కుటుంబసభ్యులకు దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. కరోనా బాధితులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక 7 రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని నిబందన పెట్టినట్లు ఆయన వివరించారు. హోమ్ ఐసోలేషన్ పూర్తయ్యాక పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. విదేశాల నుంచి వచ్చేవారు కేంద్ర […]

Written By: Neelambaram, Updated On : May 11, 2020 7:22 pm
Follow us on

కరోనా చికిత్స తర్వాత అనుసరించే విధానాలపై కేంద్రం హోం శాఖ కొన్ని మార్పులు ప్రకటించింది. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తి కుటుంబసభ్యులకు దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. కరోనా బాధితులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక 7 రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని నిబందన పెట్టినట్లు ఆయన వివరించారు. హోమ్ ఐసోలేషన్ పూర్తయ్యాక పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. విదేశాల నుంచి వచ్చేవారు కేంద్ర సూచనలు కచ్చితంగా పాటించాలని ఆయన అన్నారు. ఇంతవరకు 23 విమానాల్లో 4వేల మంది భారతీయులను తీసుకురావడం జరిగిందని, రైళ్ల ద్వారా ఐదు లక్షల మందిని స్వస్థలాలకు చేర్చామని ఆయన వివరించారు.

ఇప్పటివరకు మొత్తం 468 ప్రత్యేక రైళ్లు నడిచాయని, వీటిలో 101 రైళ్లు మే 10 న నడిపారు. అంతేకాదు వలస కార్మికులు రైల్వే ట్రాక్‌ లపై ఎట్టి పరిస్థితుల్లో నడవకుండా చర్యలు తీసుకోవాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించింది.