పత్రికలు, చానెల్స్ ను కమ్మేస్తున్న డిజిటల్ మీడియా

‘‘బ్రేకింగ్ న్యూస్.. విశాఖలో గ్యాస్ లీక్.. 12మంది మృతి’’ అనగానే క్షణాల్లో మొబైల్ ఫోన్ కు నోటిఫికేషన్ వచ్చేసింది. న్యూస్ యాప్స్ లో వార్త చదివేస్తాం.. అక్కడ పరిస్థితిపై వీడియోలు సోషల్ మీడియాలో.. డిజిటల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అవి చూసేశాం.. అంతా నిమిషాల్లో ప్రపంచమంతా తెలిసిపోయింది. సోషల్ మీడియా వీడియోలనే న్యూస్ చానెల్స్ లో టీవీలో వేసి లైవ్ లు ఇచ్చాయి. ఇక తెల్లవారి పత్రికల్లో అదేవార్త.. బ్యానర్.. ఇంక ఏం చూస్తారు జనాలు.. *సంప్రదాయ మీడియాకు […]

Written By: admin, Updated On : May 11, 2020 7:11 pm
Follow us on

‘‘బ్రేకింగ్ న్యూస్.. విశాఖలో గ్యాస్ లీక్.. 12మంది మృతి’’ అనగానే క్షణాల్లో మొబైల్ ఫోన్ కు నోటిఫికేషన్ వచ్చేసింది. న్యూస్ యాప్స్ లో వార్త చదివేస్తాం.. అక్కడ పరిస్థితిపై వీడియోలు సోషల్ మీడియాలో.. డిజిటల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అవి చూసేశాం.. అంతా నిమిషాల్లో ప్రపంచమంతా తెలిసిపోయింది. సోషల్ మీడియా వీడియోలనే న్యూస్ చానెల్స్ లో టీవీలో వేసి లైవ్ లు ఇచ్చాయి. ఇక తెల్లవారి పత్రికల్లో అదేవార్త.. బ్యానర్.. ఇంక ఏం చూస్తారు జనాలు..

*సంప్రదాయ మీడియాకు డిజిటల్ మీడియా చెక్?
అరచేతిలో ప్రపంచం.. చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చాక డిజిటల్ విప్లవమే వచ్చింది. సోషల్ మీడియా,డిజిటల్ మీడియా ఇప్పుడు వార్తల స్వరూపాన్ని స్వభావాన్ని మార్చివేస్తోంది. వేగంగా.. పారదర్శకంగా ఉన్నది ఉన్నట్టు లైవ్ వీడియోలతో వార్తలను అందిస్తోంది. అందుకే బ్రేక్ అయిన వార్త తెల్లవారి పత్రికల దాకా వచ్చేదాకా ఎవ్వరూ ఆగట్లేదు. తెలిసిన విషయమే అని పత్రికలను ఎవరూ చూడట్లేదు.

*డిజిటల్ మీడియా వార్తలే పత్రికలకు దిక్కవుతున్నాయా?
కిమ్ చనిపోయాడా? ఉన్నాడా అని సీఎన్ఎన్ వార్త రాయగానే డిజిటల్ మీడియాలో దానిపై బోలెడు కథనాలు.. ఆయన తర్వాత ఎవరు..? కిమ్ సోదరి అంట.. కిమ్ కు చిన్నాన్న అంటూ కథనాలు..ఇలా డిజిటల్ కంటెంట్ నే తెల్లవారి పత్రికలు వేస్తుండడంతో ఆ పత్రికలు చదివే నాథుడే లేకుండా పోయాడు. విశాఖ గ్యాస్ లీక్ పై కూడా జాతీయ, రాష్ట్రీయ మీడియా వెబ్ సైట్లలో భిన్న కథనాలు వచ్చాయి. అవన్నీ స్మార్ట్ ఫోన్లో ముందురోజే అందరూ చదివేశారు. సో తెల్లవారి పేపర్లలో వచ్చింది అందరికీ తెలిసిన విషయమే ఉంటోంది. వాటికి ప్రాధాన్యత తగ్గుతోంది. ఇక న్యూస్ చానెళ్లు చూసే ఓపిక కూడా జనాలకు ఉండడం లేదు. యాప్స్, ఫోన్లలోనే వార్తలను చూసేస్తున్నారు.

Also Read: లాక్‌డౌన్‌ను నెలాఖరుకు పొడిగించే అవకాశం!

*ప్రభుత్వం గుర్తించకున్నా డిజిటల్ మీడియానే టాప్
ఫోర్త్ ఎస్టేట్ లో పత్రికలు, న్యూస్ చానెల్స్ ఉన్నాయి. కానీ ఇంకా డిజిటల్ మీడియాను ప్రభుత్వాలు ఇంకా గుర్తించలేదు. కానీ ఇప్పుడు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాను మించి డిజిటల్ మీడియా దూసుకొస్తోంది. ప్రభుత్వానికి గుర్తించాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తోంది.

*జర్నలిస్టులకు డిజిటల్ మీడియానే దిక్కా?
చాలా మంది జర్నలిస్టులు, విలేకరులు ఇప్పుడు ప్రధాన స్రవంతి మీడియాలో ఉద్యోగాలు కోల్పోయారు. ఉన్న వారిలో కొందరు భారీ వేతన కోతలతో బాధపడుతున్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ తో ప్రింట్ మీడియా వ్యాపారం ఢమాల్ అయిపోయింది. ప్రకటనలు లేవు. ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాపారులు ఇచ్చే ప్రకటనలపైనే ఇవి మనుగడ సాగించేవి. కానీ వారు కూడా ఇటీవలి కాలంలో డిజిటల్ మీడియాలోనే ప్రకటనలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక లాక్ డౌన్ తో పత్రికలు, చానెల్స్ పతనం వేగంగా అవుతోంది. దీంతో జర్నలిస్టులు కూడా డిజిటల్ మీడియా వైపు అడుగులు వేస్తున్నారు.

*డిజిటల్ మీడియాలో జర్నలిస్టులు రాణిస్తారా?
పత్రికలు, న్యూస్ చానెల్స్ లో పనిచేసి తీసివేయబడ్డ జర్నలిస్టులు ఇప్పటికే వెబ్ మీడియాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి డిజిటల్ మీడియాలో రాణించడానికి సరిపడా సామర్థ్యాలు లేవనే చెప్పాలి. సాంప్రదాయ ప్రింట్ మీడియాలో మాదిరి డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్లు, ఫ్రూఫ్ రీడర్లు ఉండరు. వారే కరెక్ట్ చేయాలి.. మెరుగైన కథనాన్ని సొంతంగా తయారు చేయాలి. ఆసక్తికరంగా మలచాలి. పాఠకుడిని చివరి వరకు చదివించాలి. భాష మీద పట్టు.. తప్పులు లేకుండా రాయగల నేర్పు అత్యవసరం. బాగా ఆలోచించే స్టోరీలు సృష్టించే సామర్థ్యం ఉండాలి..

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో తోపులైన జర్నలిస్టులు సైతం డిజిటల్ మీడియా వేగం, ఖచ్చితత్వం, అద్భుతమైన కథనాలుగా మలిచే తీరును అందుకోలేకపోతున్నారు. డిజిటల్ మీడియా పూర్తిగా పత్రికలు, చానెల్స్ కు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ రంగంలో ఆల్ రౌండర్లు అయిన జర్నలిస్టులు మాత్రమే మనుగడ సాగిస్తారు. క్రియేటివిటీ లేని జర్నలిస్టులు ఇక్కడ కనుమరుగవుతారు..

Also Read: 5లక్షలమంది వలస కూలీలను తరలించారట!

*భవిష్యత్ డిజిటల్ మీడియాదే.. అలా మారాల్సిందే..

పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో తీసేసిన జర్నలిస్టులంతా డిజిటల్ మీడియా కంటెంట్ కు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంది. అలా మారినప్పుడే వారు మనగలుగుతారు. ఇక భవిష్యత్ అంతా డిజిటల్ మీడియాదే. సో ఈ రంగంపై దృష్టి సారిస్తే మంచి కంటెంట్ రైటర్లుగా ఎదగవచ్చు.

-నరేశ్ ఎన్నం