Andhra Pradesh: ఏపీ రాజకీయాలు ఏదో ఒక అంశంపై అట్టుడుకుతున్నాయి. మొన్నటివరకు అమరావతి ఉద్యమం గురించి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అమరావతిలో చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులు ధర్నాలు చేస్తున్నారిని స్వయంగా మంత్రి కొడాలని నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు రైతులకు బేషరతుగా క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.

అమరావతి రైతులు కూడా తాము పెయిడ్ ఆర్టిస్టులం కాదని కుండబద్దలు కొట్టారు. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన గొడవ గురించి అందరికీ తెలిసి ఉంటుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నోరు జారీ చేసిన వ్యాఖ్యలను.. అసెంబ్లీలో నారా చంద్రబాబు భార్య గురించి వైసీపీ ఎమ్మెల్యేలు కామెంట్ చేయడంతో ఒక్కసారిగా టీడీపీ అధినేత అసెంబ్లీని బహిష్కరించడం.. సీఎం అయ్యాక సభలో కాలుపెడతానని శపథం పూనారు. మీడియా పాయింట్‌లో తన ఫ్యామిలీని లాగి కించపరుస్తున్నారంటూ వెక్కివెక్కి ఏడ్చారు. దీంతో ఏపీ పాలిటిక్స్‌కు రీవెంజ్ పాలిటిక్స్ అని పేరు వచ్చింది.
Also Read: చంద్రబాబు బాటలో పవన్ కల్యాణ్.. టార్గెట్ వైసీపీ..!
అయితే, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడం జరిగింది.అంతేకాకుండా మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీల, అంబటి రాంబాబులను చంపితే యాభై లక్షలు ఇస్తానని కొందరు టీడీపీ నేతలు బహిరంగంగా ప్రకటించడం కూడా సంచలనంగా మారాయి. అయితే, కమ్మ సామాజిక వర్గం ప్రజలకు వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ తీవ్ర ఆగహ్రం తెప్పించాయి. దీంతో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మరికొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగా నారా భువనేశ్వరిని క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే.
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చిత్తూరు జడ్పీ సమావేశానికి హాజరైన ఆయన ముఖ్యమంత్రి జగన్ ప్రాణాలకు ముప్పు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జగన్‌కు ప్రాణహాని తలపెడతారని భయంగా ఉందంటూ బాంబు పేల్చారు. జగన్ పై కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల కోసం ఎన్నో్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
Also Read: పవన్ పాలిటిక్స్ షురూ.. విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా దీక్ష..