https://oktelugu.com/

Rajinikanth: ర‌జినీకాంత్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా..?

Rajinikanth: త‌లైవా ర‌జినీ కాంత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు ఆయ‌న‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌లో కూడా ఆయ‌న అక్క‌డి స్టార్ హీరోల‌తో స‌రిస‌మాన‌మైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. అందుకే ఆయన‌కు అంత భారీ ఫాలోయింగ్ ఉంది. స్టైల్‌కు పెట్టింది పేరుగా ర‌జినీని అభిమానులు కొలుస్తారు. ఇక తెలుగులో కూడా ఆయ‌న్ను చాలా ఓన్ చేసుకుని చూస్తారు. ఆయ‌న్ను త‌మిళ హీరోగా ఎవ‌రూ భావించ‌రు. అయితే ఇప్పుడు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 12, 2021 / 05:38 PM IST
    Follow us on

    Rajinikanth: త‌లైవా ర‌జినీ కాంత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు ఆయ‌న‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌లో కూడా ఆయ‌న అక్క‌డి స్టార్ హీరోల‌తో స‌రిస‌మాన‌మైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. అందుకే ఆయన‌కు అంత భారీ ఫాలోయింగ్ ఉంది. స్టైల్‌కు పెట్టింది పేరుగా ర‌జినీని అభిమానులు కొలుస్తారు. ఇక తెలుగులో కూడా ఆయ‌న్ను చాలా ఓన్ చేసుకుని చూస్తారు. ఆయ‌న్ను త‌మిళ హీరోగా ఎవ‌రూ భావించ‌రు. అయితే ఇప్పుడు ర‌జినీ కాంత్‌కు ఉన్న ఆస్తులు ఎన్ని అనే విష‌యాన్ని తెలుసుకుందాం.

    Rajinikanth Assets

    భారీగా ఉన్న ఫాలోయింగ్ కార‌ణంగా ఆయ‌న సినిమాల ద్వారా ఎక్కువ సంపాదిస్తున్న స్టార్ హీరోల్లో ముందు వ‌రుస‌లోనే ఉంటారు. ఒక్కో సినిమాకు దాదాపు రూ.50కోట్ల వ‌ర‌కు తీసుకుంటారు. ఆయ‌న‌కు చెన్నై సిటీలో అత్యంత విలాసవంతమైన ఇల్లు ఉంది. వీటితో పాటు రజనీకాంత్ కు నిఖ‌ర ఆస్తులే దాదాపు 365 కోట్లు ఉన్నాయి. ఇక ర‌జినీకాంత్ సేవా కార్య‌క్ర‌మాల కోసం కూడా బాగానే ఖ‌ర్చు చేస్తుంటాడు. ఇక ర‌జినీలో ఉన్న మ‌రో మంచి గుణం ఏంటంటే.. అత‌ని సినిమా ఏదైనా ఫ్లాప్ వ‌చ్చిందంటే.. నిర్మాత న‌ష్ట‌పోకుండా.. త‌న రెమ్యున‌రేష‌న్ తిరిగి ఇచ్చేస్తాడంట‌.

    ఇక ర‌జినీకి మిగ‌తా హీరోల లాగా 10 లగ్జరీ కార్లు లేవు. 3 మాత్ర‌మే ఉన్నాయి. ఇందులో టయోటా ఇన్నోవా, రేంజ్ రోవర్ తో పాటు బెంట్లీ కార్లు ఉన్నాయి. ఇక రజినీ నిక‌ర ఆస్తుల‌తో పాటు రూ.100 నుంచి రూ.120 కోట్ల దాకా పెట్టుబడుటు పెట్టారు. ఆయ‌న త‌న కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించారు. ఒక ర‌కంగా చెప్పాలంటే సౌత్ ఇండ‌స్ట్రీలో చాలా సార్లు ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు రజినీవే ఎక్కువ‌గా ఉన్నాయి. మ‌ళ‌యాల‌, తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ సినిమాల్లో కూడా నేరుగా యాక్ట్ చేశారు.

    Also Read: రజినీకాంత్ కెరీర్ లో పాపులర్ డైలాగులు ఇవే !

    ఇక రీసెంట్ గా ఆయ‌నకు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు కూడా వ‌రించింది. అంత‌కు ముందు ప‌ద్మ విభూష‌న్ అవార్డును కూడా ఇచ్చారు. మొన్న‌టి వ‌ర‌కు రాజకీయాల్లోకి వ‌స్తార‌నే ప్ర‌చారం జ‌రిగినా.. ఆ త‌ర్వాత ర‌జినీ దాన్ని వెన‌క్కు తీసుకున్నారు. త‌న‌కు రాజ‌కీయాలు వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక‌పోతే త‌న ఆస్తుల‌న్నీ తాను చ‌నిపోయాక ప్ర‌జ‌ల‌కే చెందుతాయ‌ని కూడా ఒకానొక స‌మ‌యంలో ర‌జినీ ప్ర‌క‌టించిన త‌న దాతృత్వం చాటుకున్నారు.

    Also Read: దెబ్బ అదుర్స్​ కదూ!… రజనీ సూపర్​ హిట్​ డైలాగ్స్ ఇవే

    Tags