Jagan vs Chandrababu: చంద్రబాబు… నాలుగు దశాబ్దాలుగా తెలుగునాట ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఇది. అపర చాణుక్యుడు, రాజకీయ వ్యూహాలు నెరపడంలో దిట్ట అంటారు. అయితే అది నాణేనికి ఒక వైపే. ఆయన అంచనాలు చాలావరకూ సక్సెసయ్యాయి. అదే సమయంలో అంచనాలూ తప్పాయి. నిర్ణయాలు కూడా శాపంగా మారాయి. అలిపిరిలో నాడు తనపై జరిగిన నక్సలైట్ల దాడితో తనపై సానుభూతి లాభిస్తుందని ఒక ఏడాది ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 2009లో మహానాడు కూటమిగా వెళ్లి మరోసారి దెబ్బతిన్నారు. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ ను వదులుకొని అపజయాన్ని ఏరికోరి తెచ్చుకున్నారు. అయితే రాజకీయాలన్నాక గెలుపు ఉంటుంది.. ఓటమీ పలకరిస్తుంది. అది చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఆయన కిందకు పడిపోయిన ప్రతీసారి లేచే ప్రయత్నమే చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో దారుణ ఓటమి తరువాత నైరాశ్యంలోకి వెళ్లిపోయిన పార్టీ శ్రేణులను తట్టి లేపి ప్రస్తుతం వచ్చే ఎన్నికలకు కార్యోన్ముఖులు చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా 2024 ఎన్నికలను ‘యువ నాయకత్వం’ అన్న అజెండాతో ముందుకు సాగుతున్నారు. ఎలాగైనా గెలుపొందాలన్న ప్రయత్నంలో ఉన్నారు. తన వయసును లెక్కచేయకుండా మరీ కృషిచేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న సీనియర్లు ఉన్నారు. అందరూ ఆరు పదులు దాటిన వారే. అందుకే ఈ సారి ఎన్నికల్లో వారి వారసులకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా గెలుపుబాట పట్టాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే సీనియర్లుగా ఉన్న వారి వారసులు యువ నాయకుడు లోకేష్ చుట్టూ చేరారు. తండ్రులు చంద్రబాబు వద్ద ఉండగా.. వారి వారసులు మాత్రం లోకేష్ ను ఫాలో అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వారసులు, యువ నాయకులు పోటీచేసేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పతివాడ నారాయణస్వామినాయుడు, కిమిడి కళా వెంకటరావు, మృణాళిని, అయ్యన్నపాత్రుడు, జవహార్, పరిటాల సునీత, కేశినేని నాని వంటి వారంతా తప్పుకొని..తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలని అధినేతను కోరారు. అందుకు బాబుగారు కూడా ఓకే చెప్పేశారు. దీంతో నియోజకవర్గాల్లో వారసులు పార్టీ కార్యక్రమాల నిర్వహణను ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో యువ ఓటర్లు అధికం. వారికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. యువ నాయకత్వాన్నే వారు కోరుకుంటున్నారు. దానిని గమనించిన చంద్రబాబు యువతకే ప్రాధాన్యిమిస్తున్నారు.
Also Read: Krishnam Raju Smruti Vanam: కృష్ణంరాజు మావాడంటే మావాడు..వైసీపీ, టీడీపీ మధ్య పంచాయితీ?
అయితే అటు అధికార పక్షంలో మాత్రం భిన్న వాతావరణం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వారసులకు టిక్కెట్లు ఇచ్చేది లేదంటూ జగన్ తేల్చేశారుట. దీంతో వారసులకు రాజకీయ భవిష్యత్ ఇవ్వాలనుకున్న వారి ఆశలను జగన్ ఆదిలోనే తుంచేశారు. సామినేని ఉదయభాను, పేర్ని నాని, కొడాలి నాని, భూమన కరుణాకర్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, ముస్తాఫా వంటి వారు వచ్చే ఎన్నికల్లో తమ వారసులను లైన్ క్లీయర్ చేయాలని భావించారు. అయితే యువ నాయకత్వం వహిస్తే తనకు తలపోటు అనుకున్నారేమో కానీ.. జగన్ వారందరికీ నో చెప్పేశారుట. అయితే రాజకీయంగా పిల్లలకు భవిష్యత్ ఇవ్వాలనుకున్న నాయకులకు ఇది మింగుడుపడడం లేదు. అందుకే కొందరు నాయకులు వేరే పార్టీల్లోకి పంపించాలని చూస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా 40 నియోజకవర్గాల్లో గెలుపునకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. అయితే వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. తనను చూసి ఓటు వేస్తారని భావిస్తున్న జగన్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పాత ముఖాలకే ఆదేశించినట్టు తెలుస్తోంది.
మరోవైపు చంద్రబాబులో కొత్త కోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. గతంలో ఆయన చివరి వరకూ ఏ విషయమూ తేల్చరన్న అపవాదు అయితే ఉండేది. ఈసారి మాత్రం ఎన్నికలకు ఇంకా సుదీర్ఘ కాలముండగానే డెసిషన్స్ తీసుకుంటున్నారు. అన్నింటిపైనా క్లారిటీ ఇస్తున్నారు. మరోవైపు పొత్తుల అంశాన్ని పరిశీలిస్తూనే సొంతగా బలపడాలని కూడా యత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధికార పక్షానికి అడ్వాంటేజ్ ఇవ్వకూడదని భావిస్తున్నారు. మొత్తానికైతే సీఎం జగన్ తో పోల్చుకుంటే చంద్రబాబు నిర్ణయాలు, వ్యూహాల పరంగా ముందంజలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి, చంద్రబాబుకు లాభించేలా ఉన్నాయని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
Also Read:PFI Ban- Turkey: పీఎఫ్ఐ ని భారత్ నిషేధిస్తే టర్కీ కి ఎందుకు ఇబ్బంది?