Sangareddy Husband And Wife: భార్య ప్రవర్తనలో మార్పును గమనించిన భర్త ఒక ఆలోచన చేశాడు. బెడ్ రూమ్ లో సెల్ ఫోన్ పెట్టి రికార్డింగ్ మోడ్ లో పెట్టాడు. ఆ తరువాత రోజు సెల్ చూడగా షాక్ కు గురయ్యాడు. వరుసకు సోదరుడు అయిన వ్యక్తితో భార్య చేస్తున్న పనిని చూసి బాధపడ్డాడు. ఇది మంచి పద్ధతి కాదంటూ భార్యను హెచ్చరించగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అటు ఆ వ్యక్తిని నిలదీయగా వివాహేతర సంబంధాన్ని ప్రశ్నిస్తావా అంటూ నలుగురు వ్యక్తులతో తిరిగి కిడ్నాప్ నకు యత్నించాడు. విచక్షణారహితంగా కొట్టాడు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఈ ఘటన తెలంగాణాలోని సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో వెలుగులోకి వచ్చింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి బతుకుతెరువు నిమిత్తం భార్యతో కలిసి ఏడేళ్ల కిందట అమీన్ పూర్ లోని బీరంగూడ న్యూసాయి కాలనీకి వచ్చాడు. స్థానికంగా ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాజుకు సమీప బంధువు, బావ అయిన శాఖామణి స్థానిక చర్చి ఫాస్టర్ గాఉన్నాడు. ఆయన భార్య అమీన్ పూర్ మునిసిపాల్టీలో కోఆప్షన్ మెంబర్ గా పదవీ బాధ్యతలు చేపడుతున్నారు. రాజు పిల్లలిద్దరు ప్రస్తుతం అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. రాజు, భార్య పద్మజా మాత్రమే ఇక్కడ ఉంటున్నారు.
Also Read: Singer Mangli Remuneration: సింగర్ మంగ్లీ ఒక్కో పాటకు తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా?
అయితే ఇటీవల పద్మజా నడవడికలో మార్పు వచ్చింది. తాను డ్యూటీకి వెళ్లిన తరువాత ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందని రాజు అనుమానించాడు. అందుకే రెడ్ హ్యండెడ్ గా పట్టుకోవాలని భావించాడు. బెడ్ రూమ్ లో సెల్ ఫోన్ వీడియో మోడ్ లో పెట్టి డ్యూటీకి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు సెల్ ఫోన్ చూడగా అతడికి బైర్లు కమ్మాయి. తన బావ శాఖమణియే భార్య పద్మజాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకొని మనస్తాపానికి గురయ్యాడు, భార్యను ప్రశ్నించగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

బావ శాఖామణిని నిలదీయగా ఆయన కోపంతో ఊగిపోయాడు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ స్నేహితులు కిరణ్ గౌడ్, మల్లేసు, సాయి, దినేష్, పర్మప్ప తదితరులతో రాజును కిడ్నాప్ చేసి అంతమొందించాలని ప్రయత్నించాడు. ఈ నెల 13న ఇంట్లో ఒంటరిగా ఉన్న రాజును కిడ్నాప్ చేశారు. పలు ప్రాంతాలను తిప్పుతూ విచక్షణారహితంగా కొట్టారు. ఓ మెడికల్ షాపు గోదాములో కట్టిపడేశారు. దీంతో అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకొని బయటపడిన రాజు అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు, దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. శాఖామణితో పాటు నిందితులందర్నీ అదుపులోకి తీసుకున్నారు. కాగా మునిసిపల్ ఎన్నికల్లో శాఖామణి భార్య కోఆప్షన్ మెంబర్ గా ఎంపికయ్యారు. అయితే సభ్య సమాజం తలదించుకునేలా వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా హత్యాప్రయత్నం చేయడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
అటు చర్చి ఫాస్టర్ గా ఉంటూ ఎంతో గౌరవ మర్యాదలు సంపాదించుకున్న శాఖామణి చర్యలపై స్థానికులు మండిపడుతున్నారు. అటు టీఆర్ఎస్ పార్టీ కూడా స్పందించింది. శాఖామణిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆయన భార్యకు కోఆప్షన్ సభ్యురాలిగా పదవి నుంచి తొలగించనున్నట్టు అమీన్ పూర్ టీఆర్ ఎస్ నాయకులు తెలిపారు. మతం ముసుగులో శాఖామణిపై పలురకాల ఆరోపణలున్నట్టు తెలుస్తోంది.
Also Read: Krishnam Raju Smruti Vanam: కృష్ణంరాజు మావాడంటే మావాడు..వైసీపీ, టీడీపీ మధ్య పంచాయితీ?