సీఎస్ పదవీకాలం పొడగింపుకు మొగ్గుచూపుతున్న జగన్?

సీఎం జగన్ ప్రస్తుత సీఎస్ పదవీకాలం పొడగింపుకే మొగ్గుచూపుతున్నారు. ఏపీ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నీలం సాహ్ని పదవీకాలం మరో ఆరునెలలు పెంచాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరుతున్నారు. ప్రస్తుత సీఎస్ గా కొనసాగుతున్న నీలం సాహ్ని పదవీకాలంలో జూన్ 30నాటికే ముగిసింది. దీంతో ఆమె పదవీ కాలం ఏడాది చివరి వరకు పొడగించాలని సీఎం జగన్ గతంలోనే కేంద్రాన్ని కోరగా కేవలం మూడునెలలు పొడగించింది. Also Read: బీజేపీ ఆపరేషన్ సక్సెస్ అయితే వైసీపీ, టీడీపీకి […]

Written By: Neelambaram, Updated On : July 29, 2020 12:00 pm
Follow us on


సీఎం జగన్ ప్రస్తుత సీఎస్ పదవీకాలం పొడగింపుకే మొగ్గుచూపుతున్నారు. ఏపీ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నీలం సాహ్ని పదవీకాలం మరో ఆరునెలలు పెంచాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరుతున్నారు. ప్రస్తుత సీఎస్ గా కొనసాగుతున్న నీలం సాహ్ని పదవీకాలంలో జూన్ 30నాటికే ముగిసింది. దీంతో ఆమె పదవీ కాలం ఏడాది చివరి వరకు పొడగించాలని సీఎం జగన్ గతంలోనే కేంద్రాన్ని కోరగా కేవలం మూడునెలలు పొడగించింది.

Also Read: బీజేపీ ఆపరేషన్ సక్సెస్ అయితే వైసీపీ, టీడీపీకి చిత్తడే..!

సీఎం జగన్ కు నీలం సాహ్ని ప్రభుత్వానికి అన్ని విషయాల్లో కీలకంగా మారారు. రాష్ట్రంలో కోవిడ్-19 విజృంభిస్తున్న వేళ సీఎంవో బృందంతో సీఎస్, డీజీపీలు చక్కగా కమ్యూనికేట్ చేస్తూ వైరస్ నివారణకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నారు. రోగుల అందించాల్సిన వైద్యం, డాక్టర్లు, మెడికల్ సిబ్బందికి కావాల్సిన సదుపాయాలపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కరోనా నియంత్రణకు పాటుపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ సీఎస్ మార్పు వల్ల ప్రభుత్వానికి కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు.

కొత్త సీఎస్ వచ్చిన వెంటనే ఏపీలో పనులు చక్కపెట్టేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతోపాటు ఇప్పుడు కరోనా టీంతో కమ్యూనికేషన్లో గ్యాప్ ఎదురైతే ఏపీలో పాజిటివ్ కేసులు మరింత ప్రబలే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారట. అంతేకాకుండా ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ఇటీవల ఇళ్ళ పట్టాల పంపిణీలో ఎదురైన సమస్యలను చాకచాక్యంగా పరిష్కరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె సేవలను ప్రభుత్వం ఇంకొన్నాళ్లు వాడుకుంటే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని సీఎం జగన్ అనుకుంటున్నారట.

Also Read: కరోనా అంతానికి సరికొత్త డివైస్.. త్వరలో మార్కెట్లోకి

కరోనా పరిస్థితులు, ప్రభుత్వ అవసరాల దృష్ట్యా ఆమె పదవీ కాలం పొడగించేందుకే సీఎం జగన్ మొగ్గుచూపుతున్నారని సమాచారం. సీఎం జగన్ గతంలోనే ఆమె పదవీకాలంలో ఏడాది చివరి వరకు పొడగించాలని కోరగా మూడునెలలను పెంచింది. దీంతో ఆమె పదవీ కాలం సెప్టెంబర్ 30నాటికి ముగియనుంది. అంటే మరో రెండు నెలలు మాత్రమే ఆమె సీఎస్ పదవీలో కొనసాగుతారు. దీంతో ఆమె పదవీని మరో ఆరునెలలు పొడగించాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి సీఎస్ పదవీకాలం పొడిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!