CM Jagan: ఏపీ సీఎం జగన్ రూటు మార్చేస్తున్నారు. తనకి కలిసిరాని వాటిని పక్కన పెట్టేసి.. గతంలో చంద్రబాబు ఎలాంటి పనులు చేసి సక్సెస్ అయ్యారో ఇప్పుడు జగన్ కూడా అలాంటి పనులే చేస్తూ సక్సెస్ అవుతున్నారు. వాస్తవంగా వైసీసీకి మొదటి నుంచి ఓ పేరుంది. సీక్రెట్ పార్టీ అని. అంటే చేసే ప్రతిపనిని సీక్రెట్ గా ఉంచుతూ చివరి వరకు అలాగే మెయింటేన్ చేసేవారు.

కానీ ఇప్పుడు ఎందుకో రూట్ మార్చేశారు సీఎం జగన్. ప్రతి విషయాన్ని కూడా ముందుగానే లీక్ చేస్తూ.. అందరినీ ప్రిపేర్ చేస్తున్నారు. తద్వారా చివరకు అదే పని చేసినా ఎవరూ నోరెత్తకుండా చూసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ఇలా లీకులు ఇచ్చి సక్సెస్ అయ్యేవారు. ముఖ్యంగా రాజధాని విషయంలో ఓ సారి నూజివీడు అని.. మరోసారి దోమకొండ అంటూ లీకులు ఇచ్చి ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారు.
Also Read: Samantha Yashoda Movie Release Date: ఆగస్టు 12న ‘యశోద’గా రాబోతున్న సమంత
చివరకు అమరావతిని ఫిక్స్ చేయడంతో ఎవరూ ఏం చేయలేకపోయారు. ఇప్పుడు జగన్ కూడా ఇదే పార్ములాను రెండు విషయాల్లో అమలు చేశారు. ఒకటి మంత్రుల మార్పు. మంత్రుల మార్పు ఉంటుందని ఎప్పటి నుంచో లీకులు ఇస్తున్నారు జగన. తనకు నమ్మకస్తుల ద్వారా పలానా మంత్రుల మార్పు ఉంటుందని ముందు నుంచే లీకులు ఇచ్చేశారు.
దాంతో ఆయా మంత్రులు, వారి అనుచరులు ఆ విషయంలో ముందు నుంచే ప్రిపేర్ అయిపోయారు. తమ మంత్రి పదవి ఉండబోదని పదే పదే వారికి లీకుల ద్వారా గుర్తు చేస్తూ మెంటలగా వారిని ప్రిపేర్ చేశారు. చివరకు అనుకున్నట్టు గానే మంత్రుల మార్పులో ఎలాంటి ఆందోళనలు వినిపించకుండా చూసుకున్నారు.

ఇక రెండో విషయం జిల్లాల పునర్విభజన. ముందు నుంచే 25 పార్లమెంటు స్ధానాలు కొత్త జిల్లాలు అవుతాయంటూ లీకులు ఇచ్చారు. రాను రాను వాటిపై మరింత క్లారిటీ ఇస్తూ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. చివరకు తాను అనుకున్నట్టుగానే జిల్లాల పునర్విభజన చేసేసి అందరి అంచనాలను తలకిందులు చేసేశారు. ఎన్ని రకాల అభ్యంతరాలు వచ్చినా సరే.. జగన్ మాత్రం వాటిని పక్కన పెట్టేశారు. ఇలా రెండు విషయాల్లో జగన్ తన ప్రత్యర్థి చంద్రబాబు ఫార్ములాను ఫాలో అయిపోయి సక్సెస్ అయ్యారన్నమాట.
Also Read:Dharmana Krishna Das: ‘ధర్మ’యుద్ధం.. ధర్మాన కుటుంబంలో పదవుల చిచ్చు