Homeజాతీయ వార్తలుSecret Of KCR Delhi Tour: కేసీఆర్ ఢిల్లీ టూర్ సీక్రెట్ ఇదే.. ఆ నిర‌స‌న‌కు...

Secret Of KCR Delhi Tour: కేసీఆర్ ఢిల్లీ టూర్ సీక్రెట్ ఇదే.. ఆ నిర‌స‌న‌కు వెళ్ల‌డం డౌటే..?

Secret Of KCR Delhi Tour: కేసీఆర్ సడన్ గా ఢిల్లీ వెళ్లడంతో ఆయన పర్యటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన మోడీని కలుస్తారని, అనేక అంశాలపై చర్చిస్తారని వార్తలు వినిపించాయి. చివరి అంకంగా ఢిల్లీలో ఈ నెల 11న టీఆర్ఎస్ చేపట్టబోయే నిరసన దీక్షకు కీసీఆర్ హాజరవుతారని గతంలో కేటీఆర్ ప్రకటించారు. ఇక డేట్ దగ్గర పడుతున్న సమయంలో కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్లడంతో ఆయన తప్పకుండా ఆప ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని అనుకున్నారు.

Secret Of KCR Delhi Tour
Secret Of KCR Delhi Tour

కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇది అంతా ఉత్తిదే అని తెలుస్తోంది. కేసీఆర్ పన్ను పీకించుకోవడానికి దంత వైద్యుడి దగ్గర చికిత్స తీసుకున్నారని ఆలస్యంగా వెల్లడైంది. ప్రస్తుతం ఆయన పన్ను పీకించుకోవడంతో నొప్పితో బాధపడుతున్నారని.. వారం రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. మోడీని కలుస్తారనుకున్న కేసీఆర్.. కలవకుండానే రిటర్న్ అవుతున్నారు. పోనీ టీఆర్ఎస్ చేపట్టే నిరసన దీక్షకు.. జాతీయ స్థాయిలో రైతు సంఘాల నేతలను సమన్వయం చేసి హాజరయ్యేలా చూస్తారని అంతా అనుకున్నారు.

కానీ చివరకు ఆ ప్రయత్నం కూడా చేయకుండానే వెనుదిరుగుతున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పైగా 11వ తేదీన నిర్వహించే నిరసన దీక్షకు కేసీఆర్ కూడా వెళ్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఆయ‌న‌న పంటి నొప్పితో తీవ్రంగా బాధ పడుతున్నారట. డాక్టర్లు వారం రోజులు రెస్ట్ అవసరమని సూచించారు.

కాబట్టి ఇలాంటి సమయంలో కేసీఆర్ నిరసన దీక్షకు వస్తారా అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. ఊరించి ఉసూరుమనిపించినట్టు.. నిరసన దీక్షకు కేసీఆర్ వెళ్లకుంటే మాత్రం అనుకున్న స్థాయిలో హైప్ రాదు. ఈ విషయం కేసీఆర్ కు కూడా స్పష్టంగా తెలుసు. మరి పంటి నొప్పిని అడ్డుపెట్టుకుని వెనకడుగు వేస్తే ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆటాడేసుకుంటాయి.

Secret Of KCR Delhi Tour
KCR

కాబట్టి ప్రతిపక్షాలకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా పంటి నొప్పి ఉన్నా సరే కేసీఆర్ నిరసన దీక్షకు వెళితే మాత్రం టీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ అవుతుంది. పైగా హైదరాబాద్ లో సకల సౌకర్యాలు ఉన్నాయని చెప్పే కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లి చికిత్స తీసుకోవడం ఏంటనే విమర్శలు కూడా వస్తున్నాయి. కాబట్టి వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే కేసీఆర్ తప్పకుండా నిరసన దీక్షకు హాజరు కావాలి. లేదంటే మాత్రం అన్ని రకాల పాయింట్లు బీజీపీ, కాంగ్రెస్ కు పెద్ద అస్త్రాలుగా మారే అవకాశం ఉంటుంది.

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular