• వార్త విశ్లేషణ
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
Search
OkTelugu NewsCheck
OkTelugu
  • Home
  • వార్త విశ్లేషణ
    • ఆంధ్రప్రదేశ్‌
    • తెలంగాణ
    • జాతీయ వార్తలు
    • అంతర్జాతీయం
  • ఎంటర్టైన్మెంట్
    • సినిమా ఎనాలిసిస్
    • మూవీ గాసిప్స్
    • మూవీ రివ్యూ
    • సినిమా ఫొటోలు
    • బిగ్ బాస్ 9
    • ఓటీటీ
  • రామ్స్ కార్నర్
    • రామ్ టాక్
    • వ్యూ పాయింట్
  • ఎన్నారై
  • క్రీడలు
    • క్రికెట్‌
  • లైఫ్ స్టైల్
  • వైరల్
Homeఆంధ్రప్రదేశ్‌చంద్రబాబు రాడు.. లోకేష్ చొరవ చూపడు.. ఏంటిది?
ఆంధ్రప్రదేశ్‌జాతీయ వార్తలు

చంద్రబాబు రాడు.. లోకేష్ చొరవ చూపడు.. ఏంటిది?

NARESH
By NARESH
Saturday, 10 October 2020, 10:40 AM
Facebook
Twitter
WhatsApp
Copy URL

    ఈ ఏడాది ప్రారంభం నుంచే దేశాన్ని కరోనా చుట్టుముట్టింది. దీంతో సామాన్య ప్రజలతోపాటే రాజకీయ నాయకులు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. మీటింగ్‌లైనా.. మరే సమావేశాలైనా అన్నీ వీడియో యాప్‌లతోనే నిర్వహించారు. ఇక అప్పటి నుంచి చాలా మంది ఇంకా ప్రజల్లోకి రావడం లేనే లేదు. ఈ కోవాలోకే వస్తారు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు. కరోనా ఎఫోక్ట్‌తో బాబు కొన్ని నెలలుగా ఏపీని వదిలి హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు.

    Also Read: విశాఖలో సామాన్యుడికి షాక్.. లక్షన్నర కరెంట్ బిల్లు..?

    క్రమంలో దేశంలో.. రాష్ట్రాల్లోనూ కరోనా తగ్గుముఖం పడుతోంది. ఇప్పుడిప్పుడు ప్రజలు రోడ్లెక్కుతున్నారు. ఎట్టకేలకు చంద్రబాబు కూడా అమరవతి చేరుకున్నారు. అభిమాన నేత చాలా రోజుల తర్వాత ఏపీకి చేరుకోవడంతో క్యాడర్‌‌ అంతా అక్కడికి చేరుకున్నారు. కానీ.. వారికి చంద్రబాబుతో సమావేశం అయ్యే ఛాన్స్‌ దక్కలేదట. కరోనా భయంతో చంద్రబాబు ఎవరినీ కలిసేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. దీంతో ఆయనను కలవడానికి వచ్చిన నేతలంతా అసంతృప్తితో వెనుదిరిగి వెళ్లిపోయారు. ‘ఈ మాత్రం దానికి ఆయ‌న ఏపీకి ఎందుకు వ‌చ్చిన‌ట్టు?’ అనే ప్రశ్నలూ పచ్చ చొక్కా నేతలే వేశారట. హైద‌రాబాద్‌లోనే ఉన్నా, అమ‌రావ‌తి వ‌చ్చి ఎవ‌రినీ క‌ల‌వ‌క‌పోయినా తేడా లేదు క‌దా? అని మాట్లాడుకుంటున్నారట.

    ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న నేత నెలలకు నెలలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతే ఏ క్యాడర్‌‌కు అయినా నిరాసక్తతే ఉంటుంది. అంతేకాదు.. ఆ నేతను మరిచిపోవాల్సిన పరిస్థితులూ వస్తాయి. ఇప్పుడు చంద్రబాబుకు అలాంటిదే ఎదురైంది. ఎన్ని జూమ్‌ మీటింగ్‌లో పెట్టినా.. కార్యకర్తలతో డైరెక్ట్‌గా మాట్లాడింది వేరుగా ఉంటుంది కదా..! అన్నింటికీ మించి అసలు లోకేష్ ఏం చేస్తున్నట్టు?.

    Also Read: టీడీపీ వలసలపై చంద్రబాబు ఆలోచన ఇదీ!

    చంద్రబాబుకు అంటే వ‌య‌సు మీద ప‌డింది. ఈ వ‌య‌సులో ఆయ‌న బ‌య‌ట‌కు రాక‌పోవ‌చ్చు. ఆ వ‌య‌సు వారికి క‌రోనా ప్రమాదకరమని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఇప్పుడే కాదు.. క‌రోనా పూర్తిగా పోయిందనే వరకు కూడా చంద్రబాబు జనం ముందుకు వచ్చే పరిస్థితులు లేవు. అలాంట‌ప్పుడు ఆయన కొడుకు లోకేష్ అయినా చొర‌వ‌గా ముందుకు రావొచ్చు క‌దా? అయితే.. లోకేష్‌పై ముందు నుంచీ పార్టీ కార్యకర్తలకు పెద్దగా ఇంట్రెస్ట్‌ లేదు. ఆయన పెద్దగా చొరవ చూపడనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. హైటెక్‌ బాబులా పేరొందిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ కూడా ఇప్పుడు జూమ్‌ మీటింగ్‌ల్లోనే మునిగినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా.. ఆ తర్వాత ఫలితాలు మాత్రం పార్టీకి చేటు తెచ్చే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    • Tags
    • ap politics
    • chandrababu naidu
    • coronavirus
    • Nara Lokesh
    • TDP
    • TDP leaders
    Share
    Facebook
    Twitter
    WhatsApp
    Copy URL
      Previous article
      టీడీపీ వలసలపై చంద్రబాబు ఆలోచన ఇదీ!
      Next article
      భారత్ లో 73,272 కొత్తకేసులు..
      NARESH
      NARESHhttps://oktelugu.com/
      Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

      1 COMMENT

      Comments are closed.

      RELATED ARTICLES

      CM Chandrababu: చంద్రబాబు మంచిని గుర్తిస్తున్న తెలంగాణ సమాజం!

      Saturday, 6 December 2025, 11:28 AM

      Komati Reddy Venkata Reddy: మొన్న ఉండవెల్లి.. నేడు కోమటిరెడ్డి.. జగన్ కు అదే సలహా!

      Saturday, 6 December 2025, 11:09 AM

      Chandrababu And Jagan: చంద్రబాబుకు ఉన్నది.. జగన్మోహన్ రెడ్డికి లేనిది అదే!

      Saturday, 6 December 2025, 10:48 AM

      Most Popular

      CM Chandrababu: చంద్రబాబు మంచిని గుర్తిస్తున్న తెలంగాణ సమాజం!

      Saturday, 6 December 2025, 11:28 AM

      Jai Singh Prabhakar: Rolls-Royce కార్లు కొని చెత్తకు ఉపయోగించిన రాజు.. ఎందుకో తెలుసా?

      Saturday, 6 December 2025, 11:24 AM

      Komati Reddy Venkata Reddy: మొన్న ఉండవెల్లి.. నేడు కోమటిరెడ్డి.. జగన్ కు అదే సలహా!

      Saturday, 6 December 2025, 11:09 AM

      IND vs SA: బ్యాటింగ్ భళా.. బౌలింగ్ ఢీలా.. వైజాగ్ లో గెలవాలంటే..

      Saturday, 6 December 2025, 10:56 AM
      Load more
      OkTelugu News

      ABOUT US

      OkTelugu is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.

      Contact us: oktelugu.com@gmail.com

      FOLLOW US

      Facebook
      Instagram
      Pinterest
      RSS
      Telegram
      Twitter

      © Copyright OkTelugu 2025 All rights reserved.

      • About Us
      • Cookie Policy
      • Fact Checking Policy
      • Disclaimer
      • Grievance
      • Advertise With Us
      Exit mobile version