https://oktelugu.com/

హీరోగారి భారీ డిమాండ్లు.. ఇలా అయితే కష్టమే !

సౌత్ సినీ హీరోల బిరుదులు కాస్త విచిత్రంగా ఉంటాయి. ఒకటి రెండు సినిమాలు హిట్ వస్తే చాలు.. ఇక ఆ హీరోగారు.. వెంటనే పేరుకు ముందు ఒక బిరుదు వేసుకుంటాడు. అవి ఒక్కోసారి కామెడీగా కూడా ఉంటాయి లేండి. అలాంటి బిరుదులో ఒకటి ‘మాస్ మహారాజా’ అనే బిరుదు. ముప్పై ఏడేళ్లకు హీరోగా సెటిల్ అయిన రవితేజ ఏరి కోరి పెట్టుకున్న బిరుదు ఇది. అప్పట్లో అంటే.. ఇడియట్ టైంలో అన్నమాట, రవితేజకు మాస్ లో నిజంగానే […]

Written By:
  • admin
  • , Updated On : September 16, 2020 / 05:11 PM IST
    Follow us on


    సౌత్ సినీ హీరోల బిరుదులు కాస్త విచిత్రంగా ఉంటాయి. ఒకటి రెండు సినిమాలు హిట్ వస్తే చాలు.. ఇక ఆ హీరోగారు.. వెంటనే పేరుకు ముందు ఒక బిరుదు వేసుకుంటాడు. అవి ఒక్కోసారి కామెడీగా కూడా ఉంటాయి లేండి. అలాంటి బిరుదులో ఒకటి ‘మాస్ మహారాజా’ అనే బిరుదు. ముప్పై ఏడేళ్లకు హీరోగా సెటిల్ అయిన రవితేజ ఏరి కోరి పెట్టుకున్న బిరుదు ఇది. అప్పట్లో అంటే.. ఇడియట్ టైంలో అన్నమాట, రవితేజకు మాస్ లో నిజంగానే మంచి ఫాలోయింగ్ వచ్చింది. కాకపోతే అది మాస్ మహారాజా రేంజ్ బిరుదాంకితుడా అంటే డౌటే. ఏది అయితే ఏం సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రస్తుతం రవితేజ సినిమాలు అటు మాస్ లో ఆడట్లేదు, ఇటు క్లాస్ లో ఆడట్లేదు.

    Also Read:  3వేల పాటలు పాడి 85 లక్షలు పేదలకు పంచిన చిన్మయి

    ఏ సినిమా చేసినా రవితేజకు హిట్ రావడం కష్టమైపోయింది. అయితే రవితేజ సినిమాల లిస్టులో రమేష్ వర్మ అనే రిమేక్ ల దర్శకుడితో కూడా ఓ సినిమా చేస్తోన్నాడు. ఈ సినిమా చేయడానికి రవితేజ భారీగానే రెమ్యునిరేషన్ తీసుకున్నాడు. రెమ్యునిరేషన్ తక్కువ ఇస్తున్నారనే మహా సముద్రం సినిమా నుండి తప్పుకున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ గత సంవత్సం ఒక సినిమా చేయాలి. ఆ సినిమా నుండి రెమ్యునిరేషన్ విషయంలోనే తేడా వచ్చింది. ఇప్పుడు త్రినాద్ రావ్ నక్కిన సినిమాకి కూడా భారీగా అడుగుతున్నాడట. అయినా హిట్ లేకుండా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే ఎలా. పైగా అడిగినంత ఇవ్వకపోతే సినిమా నుండి తప్పుకుంటే కెరీర్ కే నష్టం కదా.

    దీనికి తోడు పెరిగిన వయసు కారణంగా అన్ని క్యారెక్టర్స్ కి రవితేజ ప్రస్తుతం సరిపోడు. ఈ మధ్య వయసును కవర్ చేయడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. కానీ, ఎంత కవర్ చేసినా వయసు కనిపిస్తుంది. అందుకే రవితేజ కూడా జగపతి బాబులా రూట్ మార్చి వయసుకు తగ్గ పాత్రలు చేసుకోవడం మంచింది. అప్పుడు తనకున్న మార్కెట్ పోతుందేమోనని భయం ఉండదు. పైగా అనవసరమైన టెన్సన్స్ ఉండవు. అన్నిటికి మించి రవితేజ కొత్త తరహా కథల్లో పాత్రల్లో నటించొచ్చు.

    Also Read: బోల్డ్ డైరెక్టర్ కి సీనియర్ హీరోయిన్స్ దూరం !

    మరి రవితేజ ఆ దిశగా అలోచిస్తే బెటర్, రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాకపోతే రవితేజకు మార్కెట్ పూర్తిగా పోతుంది. మార్కెట్ పోయిన రెండు మూడు సినిమాల వరకూ మళ్ళీ చాన్స్ ఉంటుంది హీరోగా కొనసాగటానికి. అప్పుడు కూడా బాక్సాఫీస్ వద్ద సోలో హిట్ కొట్టకపోతే ఇక హీరోల రేసులో నుండి తప్పుకోవడమే ఉత్తమం.