జగన్ ను తిడితే కరోనా పోతుందా..?

రాజకీయం చేయడం అంటే అన్నీ తెలిసుండాలి. మంచి వాక్చాతుర్యం తో పాటు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని ఎదుర్కొనే శక్తి ఉండాలి. అలాంటప్పుడు విజయం సిద్ధిస్తుంది. అయితే కొందరు నేతలు రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్నా అప్పుడప్పుడు తప్పటడుగులు వేయాల్సి వస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో చోట ఆ నేతలు చేష్టలు బయటపడతాయి. ఇప్పుడు ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎదురవుతున్న పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకోవాలని ట్రై […]

Written By: NARESH, Updated On : May 20, 2021 1:32 pm
Follow us on

రాజకీయం చేయడం అంటే అన్నీ తెలిసుండాలి. మంచి వాక్చాతుర్యం తో పాటు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని ఎదుర్కొనే శక్తి ఉండాలి. అలాంటప్పుడు విజయం సిద్ధిస్తుంది. అయితే కొందరు నేతలు రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్నా అప్పుడప్పుడు తప్పటడుగులు వేయాల్సి వస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో చోట ఆ నేతలు చేష్టలు బయటపడతాయి. ఇప్పుడు ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎదురవుతున్న పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకోవాలని ట్రై చేస్తున్నారు. అయితే అది అంతమంచిది కాదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

కరానా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పేద, ధనిక అని తేడా లేకుండా అందరినీ శరీరాల్లోకి చేరుతోంది. దీన్ని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు ఇప్పటికే విజయం సాధించాయి. అయితే చివరకు భారత్లోకి ప్రవేశించినా ఇంకా కట్టడికి సాధ్యం కావడం లేదు. దీంతో దేశం మొత్తం ఇప్పుడు కరోనా కోరల్లో చిక్కుకుపోయింది. దీంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షలు, సమావేశాలంటూ కాలయాపన చేస్తూ సరైన నిర్ణయం తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యాక్సినేషన్ పూర్తయితే కరోనా నుంచి గట్టెక్కవచ్చని ఇదివరకు అవగాహన కల్పించినా ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో ఏపీలో దీనిని ఆసరాగా చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా జగన్ ను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. జగన్ వల్లనే ఇదంతా అన్నట్లు మాట్లాడుతున్నారు. కేంద్రంలో ఉన్న మోడీని వదిలిపెట్టి జగన్ ను అంటే ప్రజల నుంచి మద్దతు లభిస్తుందా..? అని కొందరు అంటున్నారు.

అక్రమాలు చేసి తన కుర్చీ లాగేసుకున్నాడని ఇప్పటికే అదే తరహాలో చంద్రబాబు విమర్శలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. రోజులతో పాటు అధికారం మారుతుంది. అయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు విమర్శలు చేయాలని కొందరు సూచిస్తున్నారు. ఇక ప్రజలు ఏం కావాలంటున్నారు..? వారి సమస్యలపై పోరాడకుండా.. జగన్ ను టార్గెట్ చేయడం వెనుక అంతర్యమేంటోనని కొందరు ప్రశ్నిస్తున్నారు.