ఇద్దరూ ఇద్దరే..! ప్రజా సమస్యల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమంటున్నారు..

ఓవైపు కరోనా వైరస్ తో దేశం కకావికలమవుతోంది. రకరకాల కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి. బాధితులు పెరుగుతున్నారు. చికిత్స అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే మన దేశ, రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. కరోనాతో ఓ వైపు ప్రజలు అల్లాడుతుంటే కొందరు వారి తరహాలో రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వీరిలో ముఖ్యంగ దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్ ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ప్రజలంతా కరోనా నుంచి […]

Written By: NARESH, Updated On : May 20, 2021 1:38 pm
Follow us on

ఓవైపు కరోనా వైరస్ తో దేశం కకావికలమవుతోంది. రకరకాల కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి. బాధితులు పెరుగుతున్నారు. చికిత్స అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే మన దేశ, రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. కరోనాతో ఓ వైపు ప్రజలు అల్లాడుతుంటే కొందరు వారి తరహాలో రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వీరిలో ముఖ్యంగ దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్ ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ప్రజలంతా కరోనా నుంచి తప్పించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటే వీరు మాత్రం  తమ రాజకీయ కక్షలపైనే దృష్టి పెట్టారని అంటున్నారు.
ప్రధానమంత్రి మోడీ దేశ ప్రజల ఆరోగ్యం కన్నా తన పంథా కోసం రాజకీయంగా బిజీగా మారాడని తెలుస్తోంది. ఇటీవల బెంగాల్లో గెలుపుకోసం పదే పదే పర్యటించినా ప్రజలు ఆదరించకపోయేసరికి జీర్ణించుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఇటీవల మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిపై నారదా స్కాం పేరిట సీబీఐ చేత దాడులు చేయించి వారిని విచారిస్తోంది.  మరోవైపు బీజేపీ నాయకులపై దాడులు జరిగాయంటూ, రాజకీయ హింస అంటూ గవర్నర్ తో ప్రకటనలు ఇప్పిస్తోంది.
ఏపీలో ఇటీవల ఎంపీ రఘురామకృష్ణం రాజును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై ధూషణల నేపథ్యంలో ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టారు. అయితే ఎంపీ రఘురామ మాత్రం తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని న్యాయవాది వద్ద వాపోయారు. తనపై కక్షతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఈ అంశం సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. త్వరలో వచ్చే తీర్పు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఇలా ఇద్దరు ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా తమ రాజకీయంపైనే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు దేశం మొత్తం విపత్తులో మునిగి కొట్టుమిట్టాడుతుండగా వీరు మాత్రం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేని సొంత ప్రయోజనాలపైనే దృష్టి పెడుతున్నట్లు అర్థమవుతోంది.