జాతిపిత గాంధీ మొదలుపెట్టిన పాదయాత్ర సాంప్రదాయం ఆ తరువాత రాజకీయ నాయకులకు అధికారం అందించే ఆయుధం అయ్యింది. ప్రజలకు చేరువ చేసే పాదయాత్ర ప్రతి నాయకుడికి విజయమే చేకూర్చింది. 2003 లో దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి రెండునెలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేయగా ఆయనకు 2004 ఎన్నికలలో అఖండ విజయం చేకూరింది. అదే స్పూర్తితో నారా చంద్రబాబు నాయుడు 2013లో పాదయాత్ర చేశారు. ఫలితంగా 2014లో టీడీపీ కూటమి విజయబావుటా ఎగరవేసింది.
బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!
మొదటిసారి ఎన్నికలలో తృటిలో ఓటమి చవిచూసిన వై ఎస్ జగన్ 341 రోజుల సుదీర్ఘ పాద యాత్ర చేసి 2019 ఎన్నికలలో భారీ విజయాన్ని అందుకున్నారు. పాదయాత్ర సెంటిమెంట్ స్ట్రాంగ్ గా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఇద్దరు యువనాయకులు ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. బీజేపీ సారథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి పాదయాత్ర ఆలోచన ఉన్నా, అది ఎన్నికలకు ముందే ఉండే అవకాశం కలదు. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడానికి మూడేళ్ళ సమయం పడుతుంది.
మరి ఈ పాద యాత్ర రేసులో ఉన్న మరో యువ కిశోరం లోకేష్ బాబు. టీడీపీ తరుపున తండ్రి చంద్రబాబు నేతృత్వంలో లోకేష్ బాబు పాదయాత్ర చేయడం ఖాయం అన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ట్వీట్స్ కే బెంబేలెత్తుతున్నారు, ఇక ఫీల్డ్ లో దిగితే మటాషే అని వైసీపీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు లోకేష్. నిజానికి చంద్రబాబు మరో సారి పాదయాత్ర చేయాలనే ఆలోచన ఉన్నా…లోకేష్ ఉండగా 70ఏళ్ల వయసులో ఆయన పాదయాత్రలు చేస్తే…లోకేష్ రాజకీయ భవిష్యత్ సమాధి అవుతుంది. కాబట్టి లోకేష్ బాబు పాదయాత్ర చేయడం ఖాయం.
చివరకు రఘురామ కృష్ణం రాజు సాధించింది ఏమిటీ?
పవన్, లోకేష్ ఇద్దరూ పాదయాత్రపై పట్టుదలతో ఉన్న తరుణంలో ఈ పాదయాత్ర సెంటిమెంట్ ఎవరికి వర్క్ అవుట్ అవుతుంది అనేది ఆసక్తికరం. పాదయాత్ర చేసిన ఇద్దరిలో పవన్ గెలుస్తాడా లేక లోకేష్ గెలుస్తాడా? జగన్ దూకుడికి అడ్డుకట్ట వేయాలని కూటమి కట్టి గెలుపు అందుకుంటారా అనేది ఆసక్తికర అంశం. ఒకేసారి ఇద్దరు నాయకులూ చేశారు కాబట్టి పాదయాత్ర సెంటిమెంట్ మొదటిసారి ఫెయిల్ అవుతుందా అనేది చూడాలి. కాబట్టి ఈ సారి పాదయాత్ర ఆంధ్రా రాజకీయాల్లో చాలా ప్రత్యేకం కానుంది.