Chandrababu Naidu- KCR: వెన్నుపోటు.. ఈ మాటంటేనే ముందుగా గుర్తొచ్చేది చంద్రబాబు. మామ ఎన్టీఆర్ ను గద్దె దించి అధికారం చేపట్టేందుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. ఇప్పటికీ ఆ మచ్చ వెంటాడుతునే ఉంది. అటు తరువాత ప్రజలు అధికారమిచ్చి ఆమోదం తెలిపినా వెన్నుపోటు అపవాదు మాత్రం చంద్రబాబును వీడలేదు. అయితే పడనివారు వెన్నుపోటు అంటుండగా.. పార్టీ శ్రేణులు మాత్రం నాడు లక్ష్మీపార్వతి చేతుల నుంచి పార్టీని కాపాడకపోతే ఇప్పటివరకూ మనుగడ అసాధ్యమని విశ్లేషిస్తుంటారు. ఇదంతా పక్కనపెడితే చంద్రబాబే మరో నేత వెన్నుపోటును త్రుటిలో తప్పించుకున్నారన్నది తాజాగా వెలుగుచూసిన అంశం.
2001లో కేసీఆర్ నేతృత్వంలో కుట్ర జరిగిందనే ఆరోపణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. ఈ తీవ్ర ఆరోపణను తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. కేసీఆర్ అధికార దాహం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి 21 ఏళ్ల నాటి కుట్ర బాగోతాన్ని తెరపైకి తేవడం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ ను గద్దె దించినప్పుడు ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ కీలక నేతలంతా చంద్రబాబును సపోర్టు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన దివంగత నేత బొజ్జల గోపాలక్రిష్టారెడ్డి కీరోల్ పాత్ర పోషించారు. బొజ్జల సమీప బంధువుకు సంబంధించిన వైశ్రాయ్ హోటల్ కేంద్రంగా ఎన్టీఆర్ ప్రభుత్వ కూల్చివేత విజయవంతంగా సాగింది. 1995లో పార్టీ పగ్గాలతో పాటు సీఎం పదవి చంద్రబాబుకు దక్కింది. 1999 ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు నేత్రుత్వంలోని టీడీపీ విజయం సాధించింది. కానీ నాటి సహచరుడు, నేటి తెలంగాణ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు. అప్పటి నుంచి చంద్రబాబుతో కేసీఆర్ విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి.
Also Read: National Herald Case: సోనియా, రాహుల్ చేసిన ‘ఇండియన్ హెరాల్డ్’ మనీలాండరింగ్ అసలు కథ ఏంటి..?
బీజేపీ నేత ఆరోపణ
ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయకత్వాన్నే కేసీఆర్ సవాల్ చేస్తూ వచ్చారు. 2001లో చంద్రబాబును ఏకంగా ముఖ్యమంత్రి పీఠం నుంచి కూల్చేందుకు కేసీఆర్ కూడా బొజ్జలను ఆశ్రయించారని తాజాగా బీజేపీ నేత తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. అయితే జ్యోతుల నెహ్రూ అప్రమత్తం చేయడంతో చంద్రబాబు జాగ్రత్త పడ్డారని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. బాబును దించాలని కేసీఆర్ కుట్రపన్నారనే ఆరోపణలను తోసిపుచ్చలేం. ఎందుకంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి కూడా ఇటువంటి ఆరోపణే చేశారు. అసెంబ్లీలో తన పక్కనే కేసీఆర్ కూచునే వారని, చంద్రబాబును దించాలనే అభిప్రాయాల్ని వ్యక్తపరిచేవారని మైసూరా చెప్పడానికి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.
అయితే ఎటొచ్చి బొజ్జల పాత్రపైనే అనుమానం. బొజ్జలకు కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ సన్నిహితులే. కానీ బొజ్జల తనను పడగొడతాడని తెలిసి కూడా ఆయన్ను చంద్రబాబు ప్రోత్సహిస్తారని నమ్మలేం. ఎందుకంటే తనపై కుట్ర చేస్తున్న వారిని చంద్రబాబు ఎందుకు ఉపేక్షిస్తారు. అందునా అపర చాణుక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు ఎదుట కుప్పిగంతులు వేస్తే అసలు ఊరుకునే పనిలేదు.
చివరాంకం వరకూ ప్రేమ..
మామ ఎన్టీఆర్ ను పదవి విచ్యుతుడ్ని చేయడానికి నందమూరి కుటుంబసభ్యుల సహకారం చంద్రబాబుకు చాలా ఉపయోగపడింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావ మరిది హరిక్రిష్ణలను కీ రోల్ వహించారు.కాదు చంద్రబాబు అలా చేయించారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత వారి పాత్రలను కుదించారు. పార్టీ నుంచి పొమ్మన లేక పొగ పెట్టారు. పార్టీ నుంచి సగనంపారు. అటువంటిది బొజ్జల విషయంలో చంద్రబాబు ఉపక్షిస్తారనుకోవడం పొరపాటే. బొజ్జల ప్రాణం ఉన్నంతవరకూ ఆయనతో ప్రేమగా మెలిగారు. బొజ్జల బంధువు, తన రాజకీయ జీవితానికి పునాది వేసిన వైశ్రాయ్ హోటల్ అధినేతకు రాజ్యసభకు సైతం పంపారు. అయితే చంద్రబాబును సీఎం పీఠం నుంచి దించాలని కేసీఆర్ భావించి ఉండవచ్చు కానీ.. అందులో బొజ్జల పాత్ర అనేది మాత్రం అనుమానమే.
Also Read:Attacks YCP Leaders On Officers: ఏపీలో అధికారులు, ఉద్యోగులపై ఆగని వైసీపీ దాడులు