https://oktelugu.com/

National Herald Case: సోనియా, రాహుల్ చేసిన ‘ఇండియన్ హెరాల్డ్’ మనీలాండరింగ్ అసలు కథ ఏంటి..?

National Herald Case: భారతదేశాన్ని కొన్నేళ్ల పాటు తెరవెనుక శక్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా.. ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈడీ నోటీసులు పంపించింది. నేషనల్ హెరాల్డ్ అనే పత్రికకు చెందిన మనీ లాండరింగ్ కేసులో వీరు విచారణకు హాజరు కావాల్సిందేనని తెలిపింది. వీరికి ఈడీ సమన్లు పంపించడంపై కాంగ్రెస్ నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికి బీజేపీ ఆడుతున్న నాటకమని ఆరోపిస్తున్నారు. ఏనిమిదేళ్లు కామ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2022 / 10:12 AM IST
    Follow us on

    National Herald Case: భారతదేశాన్ని కొన్నేళ్ల పాటు తెరవెనుక శక్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా.. ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈడీ నోటీసులు పంపించింది. నేషనల్ హెరాల్డ్ అనే పత్రికకు చెందిన మనీ లాండరింగ్ కేసులో వీరు విచారణకు హాజరు కావాల్సిందేనని తెలిపింది. వీరికి ఈడీ సమన్లు పంపించడంపై కాంగ్రెస్ నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికి బీజేపీ ఆడుతున్న నాటకమని ఆరోపిస్తున్నారు. ఏనిమిదేళ్లు కామ్ గా కూర్చున్న ఈడీ ఒకేసారి దేశంలోని జాతీయ పార్టీ అధ్యక్షురాలకు నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ కేసును 2015లో మూసివేసినా మళ్లీ ఈ విషయంలో నోటీసులు పంపించడం రాజకీయంగా కొత్త చర్చకు ఊపిరిపోసింది. ఈ నేపథ్యంలో అసలు సోనియా, రాహుల్ లకు ఇండియన్ హెరాల్డ్ పత్రిక తో సంబంధమేంటి…? వీరు ఈ కంపెనీతో ఎలాంటి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    sonia, rahul gandhi

    1938లో ప్రజలకు వార్తలు చేరవేయాలనే ఉద్దేశంతో పండిట్ జవహర్ లాల్ నెహ్రుతో పాటు పలువురు స్వాంత్ర్యసమరయోధులు కలిసి నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను స్థాపించారు. అప్పట్లో రూ.5 లక్షల మూలధనంతో ఏర్పాటు చేసిన ఈ పత్రికలో అసోసియేటెడ్ జర్నల్స్ అనే కంపెనీ దీంతో పాటు చిన్నా చితకా పత్రికల్ని ప్రచురించేంది. అయితే స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో హెరాల్డ్ కంపెనీ వివిధ రూపాల్లో మూలధనం, భూములు విరాళంగా వచ్చాయి. ఇలా 2008నాటికి వాటి విలువ రూ.5 వేల కోట్లు దాటేసింది. అయితే కంపెనీకి ఆస్తులు పెరిగినా పత్రిక రాణించలేకపోయింది. దీంతో ఇదే సంవత్సరంలోనే ఈ పత్రిక మూత పడింది.

    Also Read: Attacks YCP Leaders On Officers: ఏపీలో అధికారులు, ఉద్యోగులపై ఆగని వైసీపీ దాడులు

    అయితే దీనిని కాంగ్రెస్ రక్షించాలనుకుంది. దీంతో మరోసారి ప్రజల నుంచి విరాళాలు సేకరించింది. కొంత పార్టీ సొమ్మును కలిపి మొత్తం అసోసియేటెడ్ జర్నల్స్ కు రూ.90 కోట్ల అప్పు ఇచ్చింది. అయితే ఈ అప్పు తీర్చలేదని భావించి కాంగ్రెస్ పార్టీయే ఆ అప్పును 94 శాతం మాఫీ చేసింది. మిగిలిన 6 శాతం అంటే రూ.50 లక్షలు సోనియా, రాహుల్ కు చెందిన సొంత కంపెనీలకు వాడుకున్నారు.

    ఈ తరుణంలో 2010లో ‘యంగ్ ఇండియన్’ అనే సంస్థ ఏర్పడింది. ఇందులో సోనియా, రాహుల్ వాటాలది 76 శాతం. మిగతా 24 శాతం గాంధీ నమ్మకస్తులుగా ఉంటున్న మోతీలాల్ వోరా, అస్కార్ ఫెర్నాండెజ్ లది. ఈ సంస్థ ఏర్పడిన 15 రోజులకు దాని ప్రతినిధిగా ఉన్న మోతీలాల్ వోరా ఓ ఓప్పందం చేసుకున్నాడు. అదేంటంటే అప్పటికే కాంగ్రెస్అధికార ప్రతినిధిగా ఉన్న మోతీలాల్ వోరా.. అసోసియేటెడ్ జర్నల్స్ ఎండీ మోతాల్ వోరా హోదాలు తన ఫైలుకు తానే సంతకాలు పెట్టుకున్నారు. ఇలా రెండు హోదాల్లోనూ 90 కోట్ల రూపాయలను మళ్లించారు. అంటే అసోసియేటెడ్ జర్నల్ అప్పు చెల్లించలేని స్థితిలో కాంగ్రెస్ ఈ రుణాన్ని మాఫీ చేయించినట్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఇలా రుణ మాఫీ చేసిందుకు అసోసియేటెడ్ జర్నల్స్ నుంచి యంగ్ ఇండియా సంస్థకు రూ.50 లక్షలు చెల్లించినట్లు సంతకాలు జరిగాయి.

    sonia, rahul gandhi

    అంటే అటు అసోసియేటెడ్ జర్నల్స్ తరుపునా.. ఇటు కాంగ్రెస్ పార్టీ తరుపునా.. నిధులను మళ్లించి మొత్తానికి రూ.90 కోట్లు గాయబ్ చేసేశారు. ఈ క్రమంలో అసోసియేటెడ్ జర్నల్స్ కు చెందిన వేల కోట్ల ఆస్తులు సోనియా, రాహుల్ చేతికి వచ్చాయి. 2008లో వీటి ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు. మార్కెట్ విలువ రూ.5వేల కోట్లపైమాటే. అయితే ఇప్పుడు ఎంత ఉందనేది ఊహకే వదిలేయాలి. వాస్తవానికి అసోసియేటెడ్ జర్నల్స్ ఆస్తులు వారసులకు చెందాలి. కానీ వారి వారసులెవరో తెలియదు. అలాంటప్పుడు ఆ ఆస్తి ప్రభుత్వానికి చెందుతుంది. కానీ అలా చెందకుండా ఇలా నిధులు మళ్లించారని సోనియా, రాహల్ లు పథకం వేశారని ఈడీ ఆరోపిస్తోంది.

    Also Read:YCP Plenary Meeting: మహానాడుకు తలదన్నేలా ప్లీనరీ.. ముఖం చాటేస్తున్న వైసీపీ నేతలు

    Recommended Videos

     

    Tags