Poonam Kaur: నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియా పోస్ట్స్ తరచుగా వార్తలకెక్కుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోయిన యువతిగా ఆమెను కత్తి మహేష్ ప్రొజెక్ట్ చేశాడు. కాటం రాయుడు సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇచ్చిన కత్తి మహేష్ ని పవన్ ఫ్యాన్స్ తిట్టిపోశారు. అప్పట్లో పవన్ ఫ్యాన్స్- కత్తి మహేష్ వివాదం తారా స్థాయికి చేరింది. ఆవేశానికి గురైన కత్తి ఓ టీవీ ఛానెల్ లో కూర్చొని పూనమ్ కౌర్ ని పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మోసం చేశారంటూ ఆరోపణలు చేశారు.
అప్పటి నుండి పూనమ్ కౌర్ పవన్ పై పరోక్షంగా ట్వీట్స్ వేస్తూ ఉంటారు. ఒక్కసారి కూడా ఆమె నేరుగా పవన్ ని విమర్శించింది లేదు. కానీ పవన్ కి తగిలేలా, ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా ఆమె ట్వీట్స్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో పొగుడుతున్నట్లు ఉండే ఆమె ట్వీట్స్ కొన్ని సార్లు తిడుతున్నట్లు ఉంటాయి. ఈ మధ్య ఆమె పీకె లవ్(#PK Love) అనే ట్యాగ్ వాడుతున్నారు. ఇది కొందరిని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఓ నెటిజెన్ ఉండబట్టలేక అడిగేశాడు. మేడం అసలు ఈ #PK Love అంటే పూనమ్ కౌరా? లేక పవన్ కళ్యాణ్ నా? అంటూ సోషల్ మీడియాలో వివరణ కోరారు.
Also Read: Major Movie Review: మేజర్ మూవీ రివ్యూ.. హిట్టా ? పట్టా ?
స్పదించిన పూనమ్ కౌర్… ఏ కారణం లేకపోయినా మీరు నన్ను ట్రోల్ చేస్తూ ఉంటారు కదా? అయినా కూడా నేను ఇలానే చేస్తుంటానని అర్థం. నీకు అర్థమైందా తమ్ముడూ నన్ను కార్నర్ చేయడం అంత ఈజీ కాదని, అంటూ కౌంటర్ వేసింది. పూనమ్ కామెంట్ చూస్తే ఎవరు ఏమన్నా తగ్గేదేలే అన్నట్లుంది. ఆమె తరచుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కెలుకుతూ వార్తల్లో నిలుస్తుంది. అసలు ఆమె పోరాటం ఎవరిపైనో? ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటో? నేరుగా చెప్పి ఈ వివాదానికి, ఫుల్ స్టాప్ పెట్టొచ్చుకదా అని కొందరు అంటున్నారు. పూనమ్ మాత్రం నేనింతే అంటూ… ముందుకు వెళుతున్నారు.
Also Read:Ram Boyapati Movie Story: రామ్ – బోయపాటి మూవీ స్టోరీ లైన్ ఇదే