https://oktelugu.com/

CM Chandhrababu : కేవలం ఐదు శాతంతో నాలుగో స్థానంలోకి.. దేశంలోనే బెస్ట్ సీఎంగా చంద్రబాబు కు ఇది చాలా తక్కువే

జాతీయస్థాయిలో మరోసారి ఏపీ చర్చనీయాంశం అయ్యింది. సీఎం చంద్రబాబు ఉత్తమ ముఖ్యమంత్రిలలో నాలుగో స్థానంలో నిలిచారు. అయితే కేవలం ఐదు శాతం ఓటింగ్ తో ఆయన ఈ ఘనత సాధించడం విశేషం. దీనిపై టిడిపి గొప్పగా ప్రచారం చేస్తుండగా.. వైసిపి మాత్రం అనేక సందేహాలను వ్యక్తం చేస్తోంది. ఇది వివాదానికి దారితీస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : August 23, 2024 / 10:15 AM IST

    Fourth best Chief Minister

    Follow us on

    CM Chandhrababu : దేశంలోనే ఏపీ సీఎం చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. ప్రధాని మోడీ కంటే ముందుగానే రాజకీయాల్లోకి వచ్చారు. 1978లోనే తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన అనతి కాలంలోనే ఆ పార్టీని హస్తగతం చేసుకోగలిగారు. 1995లో తొలిసారిగా సీఎం అయ్యారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి నాలుగు సార్లు సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఆయనకు వచ్చింది. సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించారు. అపారమైన అనుభవం ఆయన సొంతం. రాజకీయంగా చాణుక్యుడు అన్న పేరు ఉంది. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆయనను చెప్పుకుంటారు. 2014లో రాష్ట్ర విభజనతో.. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎం అయ్యారు. ఇప్పుడు రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు.ఇప్పుడున్న చాలామంది జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు కంటే జూనియర్లే. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు చంద్రబాబు. అనుభవజ్ఞుడైన ఒక నేత అవసరమని భావించి ప్రజలు చంద్రబాబుకు చాన్స్ ఇచ్చారు.అయితే ప్రజల అంచనాలు అందుకు లేకపోయినా చంద్రబాబు 2019 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నారు. ఎన్నికల్లో మళ్లీ గెలిచారు.ఎన్నికల ప్రచారంలో భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.అయితే అధికారంలోకి వచ్చి 75 రోజులు దాటుతున్నా సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రారంభించలేదు. దీంతో ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో జాతీయస్థాయిలో ఉత్తమ సీఎంలలో చంద్రబాబు నాలుగో స్థానంలో నిలవడం విశేషం.

    * మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో సర్వే
    మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట ఆజ్ తక్ చానల్ నిర్వహించిన సర్వేలో చంద్రబాబు జాతీయ స్థాయిలో నాలుగో ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం నాలుగో స్థానంలో నిలవడం విశేషం. 33 శాతం మార్కులతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో నిలిచారు. 14 శాతం తో అరవింద కేజ్రీవాల్, 9 శాతంతో మమతా బెనర్జీ నిలిచారు. చంద్రబాబు, స్టాలిన్ సంయుక్తంగా నాలుగువ స్థానాన్ని పంచుకున్నారు. 75 రోజుల కిందటే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతలోనే ఈ ఘనత సాధించారని టిడిపి వర్గాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి.

    * అనేక సందేహాలు
    అయితే నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నేత.. ఐదు శాతంతో ఈ ఘనత సాధించడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంటే మిగతా 95% ఆయనకు మద్దతు తెలపడం లేదా అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఐదు శాతంతో ఉత్తమ సీఎం ఏంటి అన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దేశంలో బెస్ట్ సీఎం గా నాలుగో స్థానంలో నిలిచిన చంద్రబాబుకు ప్రజల మద్దతు ఇంతేనా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం ఐదు శాతం ప్రజల మద్దతుతో ఎలా బెస్ట్ సీఎంగా ఎంపిక చేశారని నెటిజన్లు నిలదీసినంత పని చేస్తున్నారు. ఇందులో ప్రచార ఆర్భాటమే ఎక్కువగా ఉందని అనుమానిస్తున్నారు.

    * సోషల్ మీడియాలో రచ్చ
    చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి 75 రోజులు అవుతోందని.. ఈ రెండు నెలల్లోనే ఆయన నాలుగో స్థానంలో నిలవడం చిన్న విషయం కాదని టిడిపి వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. జాతీయస్థాయిలో ఈ సర్వే వచ్చిందని.. చంద్రబాబు సుపరిపాలన అందిస్తున్నారని.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. వచ్చే ఏడాది నాటికి ఆయన దేశంలోనే ది బెస్ట్ సీఎం గా నిలుస్తారని టిడిపి వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. దీనికి వైసిపి కౌంటర్ అటాక్ చేస్తుండడంతో.. సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది.