https://oktelugu.com/

Hanu Raghavapudi : ఎన్టీయార్ అభిమానిని అని చెప్పుకోవడానికి చాలా గర్వం గా ఉంది అంటున్న ప్రభాస్ డైరెక్టర్…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది నటులు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇక్కడ కొంతమందికి మాత్రమే చాలా మంచి ఇమేజ్ అయితే ఏర్పడుతుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు...

Written By:
  • Gopi
  • , Updated On : August 23, 2024 / 10:02 AM IST

    Hanu Raghavapudi-NTR

    Follow us on

    Hanu Raghavapudi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న ‘దేవర ‘ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇక దేవర సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఇండస్ట్రీలో ఒక భారీ రికార్డును కూడా క్రియేట్ చేయబోతుందంటూ సినిమా యూనిట్ నుంచి వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కి ప్రేక్షకుల్లోనే కాకుండా చాలామంది సినీ సెలబ్రిటీ ల్లో కూడా అభిమానులు ఉన్నారని విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ అభిమానుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందనే చెప్పాలి…

    నిజానికి రాజమౌళితో చేసిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా నుంచి మొన్నటి ‘త్రీబుల్ ఆర్’ సినిమా వరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో తన క్యారెక్టర్రైజేషన్ కి సరిపడా న్యాయం మాత్రం చేస్తూ ముందుకు సాగుతూ వస్తున్నాడు. మరి ఇలాంటి ఎన్టీఆర్ తన ఎంటైర్ కెరియర్ లో డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పించాడు. అందువల్లే ఆయనకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారనే చెప్పాలి. తన నటన పరంగా ప్రేక్షకులందరినీ కట్టిపడేసే ఆయన, ఎంత పెద్ద డైలాగులు అయినా సరే సింగిల్ టేక్ లో చెప్పేస్తాడు. అందుకే ఆయనని అందరూ సీనియర్ ఎన్టీఆర్ తో పోలుస్తూ తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు సంపాదించుకుంటున్నాడు అంటూ కామెంట్లు అయితే చేస్తున్నారు…

    ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ కి సినిమా ఇండస్ట్రీలో చాలామంది అభిమానులు ఉండడమే కాకుండా ఒక స్టార్ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ కి అభిమానిగా మారడనే విషయం మనలో చాలామందికి తెలియదు. సీత రామం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి…తను మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా ఉంటూ చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన పలు సందర్భాల్లో నేను ఎన్టీఆర్ అభిమానని అని చెప్పుకోడానికి చాలా గర్వపడుతున్నాను అంటూ చాలా గొప్ప స్పీచ్ లను కూడా ఇచ్చాడు.

    ఇక ప్రస్తుతం హను రాఘవపూడి ప్రభాస్ తో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని అనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది… ఇక ప్రభాస్ తో చేస్తున్న ఫౌజీ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే హను రాఘవ పూడి ని మించిన దర్శకుడు మరొకరు లేరనేది ప్రూవ్ అవుతుంది…