https://oktelugu.com/

రిటైర్ మెంట్ పై చంద్రబాబు నోట ఆ మాట వినగలమా..!

ఏ ఉద్యోగికి అయినా రిటైర్‌‌మెంట్‌ తప్పనిసరి. కానీ.. రాజకీయాల్లో మాత్రం ఆ పదం వినిపించదు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత వి.హనుమంతారావును కూడా ఓ జర్నలిస్ట్‌ ఇదే ప్రశ్నఅడిగారు. ‘మీరు ఇక రాజకీయాల నుంచి రిటైర్‌‌మెంట్‌ అవ్వచ్చు కదా’ అని. దానికి ఆయన సమాధానం ఏం ఇచ్చారో తెలుసా.. ‘నేను ఇప్పటికీ యూత్‌నే.. నాకెప్పుడూ రాజకీయాల్లో నుంచి రిటైర్‌‌మెంట్‌ లేదు’ అంటూ బదులిచ్చారు. ఇటీవల బీహార్‌‌ సీఎం మాత్రం నితీశ్‌కుమార్‌‌ ఇవి తనకు లాస్ట్‌ ఎన్నికలంటూ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2020 2:25 pm
    Follow us on

    Chandrabbau Lokesh


    ఏ ఉద్యోగికి అయినా రిటైర్‌‌మెంట్‌ తప్పనిసరి. కానీ.. రాజకీయాల్లో మాత్రం ఆ పదం వినిపించదు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత వి.హనుమంతారావును కూడా ఓ జర్నలిస్ట్‌ ఇదే ప్రశ్నఅడిగారు. ‘మీరు ఇక రాజకీయాల నుంచి రిటైర్‌‌మెంట్‌ అవ్వచ్చు కదా’ అని. దానికి ఆయన సమాధానం ఏం ఇచ్చారో తెలుసా.. ‘నేను ఇప్పటికీ యూత్‌నే.. నాకెప్పుడూ రాజకీయాల్లో నుంచి రిటైర్‌‌మెంట్‌ లేదు’ అంటూ బదులిచ్చారు. ఇటీవల బీహార్‌‌ సీఎం మాత్రం నితీశ్‌కుమార్‌‌ ఇవి తనకు లాస్ట్‌ ఎన్నికలంటూ ప్రకటించారు. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఐదేళ్ల తర్వాత ఆయన సీఎం పదవి నుంచి దిగిపోవచ్చు కానీ.. రాజకీయాల నుంచి మాత్రం రిటైర్‌‌మెంట్‌ కారనేది స్పష్టం.

    Also Read: చంద్రబాబు, అదానీ, ఓ జగన్.. కథ

    నిజానికి నితీష్, మోడీ, చంద్రబాబు వీళ్లంతా ఒకే వయసువారు. అందరూ 70 దాటిన వారే. మోడీకి ఇంకా మూడున్నరేళ్ళ పాటు అధికారం చేతిలో ఉంది. 2024 లోనే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే మోడీకి ఆనాటికి 75 ఏళ్లు వస్తాయి. మరి ఆయన కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారా అన్నది ఆసక్తే. ఇక ఏపీ విషయానికి వస్తే చంద్రబాబు నోట రిటైర్మెంట్ అన్న మాట ఇంతవరకు వినిపించలేదు. అసలు వినిపించదు అనే చెప్పాలి. అంతేకాదు.. ఆయన ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఈ తీరును చూసిన వారు ఆయన ఇంకా ఎన్ని టెర్మ్‌లు సీఎం కుర్చీలో ఉండడానికే చూస్తున్నారని అంటున్నారు.

    నిజానికి తమ ప్రియతమ నాయకుడు పోటీ చేయను అంటే జనాలు కూడా ఊరుకోరు కదా. అందుకే.. చంద్రబాబు కూడా 2024 నాటికి తాను ఈసారికి ప్రజలకు సేవ చేసుకుంటాను, తన అనుభవం పూర్తిగా వినియోగించి ఏపీని బాగు చేస్తాను అని విన్నపాలు చేసుకోవచ్చు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇదే చివరి ఛాన్స్ అని చంద్రబాబు అడిగినా అడగవచ్చు. ఓ విధంగా 2019 ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ మాదిరిగా అన్న మాట. మరి దాన్ని జనాలు పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటే టీడీపీకి తిరుగు ఉండదనే చెప్పాలి.

    Also Read: మద్యం తాగేవారికి షాకింగ్ న్యూస్.. పదేళ్లు జైలు శిక్ష..?

    ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కూడా 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలకు దూరం అవుతారనే అంటున్నారు. తన కుమారుడిని సీఎం చేసి తాను తప్పుకుంటారని కూడా వినిపిస్తోంది. వీలుంటే జాతీయ స్థాయిలో గట్టిగా ట్రై చేసుకోవడం, లేకపోతే పార్టీ పెద్దగా ఉండడం అన్నది కేసీయార్ ఆలోచన. చంద్రబాబుకు అలాంటి సదుపాయం ఉందా అన్నది ఇక్కడ చూడాలి. లోకేష్ కి పగ్గాలు ఇస్తాను అంటే జనాలే కాదు, పార్టీలో తమ్ముళ్ళే ఊరుకోరు. అందువల్ల టీడీపీ బండిని లాగించాలంటే బాబు తన బొమ్మతోనే కథ నడిపించాలి. వచ్చే ఎన్నికల్లో నితీష్ ఫార్ములా వాడినా చంద్రబాబుకు వర్కవుట్‌ అవుతుందా అనేది అనుమానాలే ఉన్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్