https://oktelugu.com/

ఫరూక్ అబ్దుల్లా.. నువ్వు అసలు భారతీయుడివేనా?

ఫరూక్‌ అబ్దుల్లా.. దేశ రాజకీయాల్లో అందరికీ తెలిసిన నేత. ఓ గొప్ప కుటుంబ వారసుడిగా.. గతంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. ఏళ్లపాటు ఓ పార్టీ అధినేతగా చక్రతిప్పుతున్న నేత. మరో విధంగా ఫరూక్ అంతర్జాతీయ నేతగా కూడా చెప్పుకోవచ్చు. సరిహద్దు రాష్ర్టమైన జమ్ము-కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఆయన అంతర్జాతీయ సమాజానికి కూడా సుపరిచితుడే. ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా ప్రస్తుతం తన తండ్రి స్థాపించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేతగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కశ్మీర్ రాజధాని నగరం శ్రీనగర్ పార్లమెంట్ సభ్యుడిగా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2020 / 01:47 PM IST
    Follow us on

    ఫరూక్‌ అబ్దుల్లా.. దేశ రాజకీయాల్లో అందరికీ తెలిసిన నేత. ఓ గొప్ప కుటుంబ వారసుడిగా.. గతంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. ఏళ్లపాటు ఓ పార్టీ అధినేతగా చక్రతిప్పుతున్న నేత. మరో విధంగా ఫరూక్ అంతర్జాతీయ నేతగా కూడా చెప్పుకోవచ్చు. సరిహద్దు రాష్ర్టమైన జమ్ము-కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఆయన అంతర్జాతీయ సమాజానికి కూడా సుపరిచితుడే. ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా ప్రస్తుతం తన తండ్రి స్థాపించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేతగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కశ్మీర్ రాజధాని నగరం శ్రీనగర్ పార్లమెంట్ సభ్యుడిగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా మిగిలిపోతున్నారు.

    Also Read: డీకే అరుణ, పురంధేశ్వరికి అందలం.. బీజేపీ సంచలన నిర్ణయాలు

    80 ఏళ్ల వయసు ఉన్న ఫరూక్‌ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆయన అసలు సీనియర్‌‌ లీడర్‌‌లా మాట్లాడుతున్నారా లేక అనాలోచితంగా వ్యాఖ్యలు చేస్తున్నారా అని అందరిలోనూ ప్రశ్న వస్తోంది. తాజాగా 370వ అధికరణం గురించి ఫరూక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. చైనా సాయంతో అధికరణం 370ని పునరుద్ధరిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఓ టెలివిజన్ ఛానల్ తో మాట్లాడుతూ ఈ అనాలోచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే 370వ అధికరణను గతేడాది ఆగస్టులో కేంద్రం రద్దు చేసింది. వెంటనే కేంద్రం ఫరూక్ ను గృహ నిర్బంధానికి తరలించింది. పరిస్థితులు సద్దుమణిగిన అనంతరం ఇటీవలనే విడుదల చేసింది.

    ఫరూక్ అబ్దుల్లా ప్రత్యర్థి పార్టీ అయిన పీడీపీ (పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ సైతం నిర్బంధం నుంచి కొద్ది రోజుల క్రితమే విడుదలయ్యారు. ఇప్పుడు ఇద్దరూ కలసి 370 అధికరణ పునరుద్ధరణకు పోరాడుతామని ప్రకటించారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, రాజకీయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అయితే.. ఇందులో కశ్మీరీ నేతలుగా వారి డిమాండులో కూడా తప్పేమీ లేదు. వారి రాజకీయ మనుగడ కోసం ఇలాంటి పోరాటం చేయడం అనివార్యం. అయితే ప్రత్యర్థి అయిన చైనా సాయంతో 370వ అధికరణ పునరుద్ధరణకు పోరాడతామని సీనియర్ నాయకుడైన ఫరూక్ అబ్దుల్లా ప్రకటించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం, నిరసన వ్యక్తమవుతోంది. చైనాతో లద్దాఖ్ సరిహద్దుల్లో ఆరు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సగటు భారతీయుడు ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై మండిపడుతున్నాడు.

    Also Read: మెత్తబడ్డ ట్రంప్.. జోబైడెన్ గెలుపుపై తొలిసారి స్పందన

    కమ్యునిస్టు దేశమైన డ్రాగన్ తమ దేశంలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ లో ‘వీగర్’ ముస్లిములను ఎలా వేధిస్తుందో, ఎలా అణచివేస్తుందో అంతర్జాతీయ సమాజానికి తెలుసు. సాటి ‘వీగర్’ ముస్లిముల సమస్యలు, ఇబ్బందులపై మాట్లాడటానికి గొంతు పెగలని ఫరూక్ అబ్దుల్లా చైనా సాయంతో 370వ అధికరణను పునరుద్ధరిస్తామని ప్రకటించడం జాతి ద్రోహమే అవుతుంది. కశ్మీర్ మహారాజా కుటుంబ వారసుడైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ కరణ్ సింగ్, కశ్మీరీ పండిట్లు ఫరూక్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడంతో ఆయన మాట మార్చారు. తన ఉద్దేశం అది కాదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ఫరూక్ అబ్దుల్లా వివరణ ఇచ్చారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్