https://oktelugu.com/

Chandrababu: చంద్రబాబు మారారు.. ఇది చూస్తే నిజం అంటారు?

Chandrababu: ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబులో మార్పులు వస్తున్నాయి. పార్టీని గాడిలో పెట్టే పనిలో భాగంగా కార్యకర్తలను మార్చాలంటే ముందు తను మారాలి అనే కోణంలో ఆలోచిస్తున్నారు. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా తానున్నానని భరోసా కల్పిస్తున్నారు. ఫలితంగా కార్యకర్తల్లో నిరాశ లేకుండా చేస్తున్నారు. పార్టీ కోసం పని చేసేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని చెబుుతున్నారు. ఈ సంకేతాలతో పార్టీ భవితవ్యం మారేలా కనిపిస్తోంది. ఇన్నాళ్లు చంద్రబాబును విమర్శించిన నేతలు ఆయన కోణంచూసి విస్తుపోతున్నారు. ఆయనలో వచ్చిన […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 15, 2022 2:05 pm
    Follow us on

    Chandrababu: ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబులో మార్పులు వస్తున్నాయి. పార్టీని గాడిలో పెట్టే పనిలో భాగంగా కార్యకర్తలను మార్చాలంటే ముందు తను మారాలి అనే కోణంలో ఆలోచిస్తున్నారు. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా తానున్నానని భరోసా కల్పిస్తున్నారు. ఫలితంగా కార్యకర్తల్లో నిరాశ లేకుండా చేస్తున్నారు. పార్టీ కోసం పని చేసేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని చెబుుతున్నారు. ఈ సంకేతాలతో పార్టీ భవితవ్యం మారేలా కనిపిస్తోంది. ఇన్నాళ్లు చంద్రబాబును విమర్శించిన నేతలు ఆయన కోణంచూసి విస్తుపోతున్నారు. ఆయనలో వచ్చిన మార్పుకు ఫిదా అవుతున్నారు. భవిష్యత్ లో ఇలాగే ఉంటే పార్టీ విజయం ఖాయమనే ధీమా అందరిలో వస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

    Chandrababu

    నిన్న గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన టీడీపీ కార్యకర్త హత్య జరిగిన విషయం తెలుసుకున్న బాబు హుటాహుటిన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.. హతుడు చంద్రయ్య పాడె మోశారు. నాయకులకు భరోసా కల్పించారు. మీకు నేనున్నానని ధైర్యం చెప్పారు. అధికార పార్టీని ఎండగట్టారు. హత్యా రాజకీయాలు ఆపకపోతే తాము సైతం అదే బాటలో వస్తామని హెచ్చరికలు చేశారు. దీంతో కార్యకర్తల్లో కొండంత అండ దొరికినట్లు అయింది. ఇన్నాళ్లు బలహీనంగా కనిపించిన కార్యకర్తలు బాబు రాకతో ధైర్యంగా నిలిచారు.

    Also Read: సంక్రాంతి విశిష్టత, ఈ రోజున చేయాల్సిన దానాలేంటో మీకు తెలుసా?

    గతంలో చంద్రబాబు కార్యకర్తలను పట్టించుకునే వారు కాదు. క్షేత్ర స్థాయిలో వెళ్లి పరామర్శించే వారు కాదు. దీంతో కార్యకర్తల్లో నైరాశ్యం పెరిగేది. తమకు ఎవరు లేరనే బాధతో ఉండేవారు. కానీ బాబులో వచ్చిన మార్పుతో ప్రస్తుతం టీడీపీ కేడర్ మరింత బలోపేతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధినేతలో వస్తున్న మార్పులకు కార్యకర్తల్లోనే ఆశ్చర్యం కలుగుతోంది. మా చందరబాబేనా అనే కోణంలో అందరు ఆలోచనలో పడిపోయారు. ఇంతలా మార్పు రావడం నిజంగా శుభ పరిణామమే అని నేతలు సెలవిస్తున్నారు.

    2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు కార్యకర్తలను కలిసిన సందర్భాలు చాలా తక్కువ. దీంతో పార్టీ కేడర్ ఇతర పార్టీల్లోకి వలస వెళ్లింది. దీంతో చంద్రబాబు చిక్కుల్లో పడ్డారు. ఓటమి పాలయ్యారు. కానీ పరిస్థితుల్లో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తున్న బాబు తాను కూడా మారాలని భావించారు. దీంతో సందర్భానుసారంగా కార్యకర్తలను కలిసేందుకు నిర్ణయించచుకున్నారు. ఇందులో భాగంగానే మాచర్లలో పర్యటించి అధికార పార్టీకి సవాలు విసిరారు. రాష్ర్టంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. జంతువులకంటేహీనంగా ప్రవర్తిస్తున్న అధికార పార్టీ కార్యకర్తలపై కారాలు మిరియాలు నూరారు.

    కార్యకర్తల్లో జోష్ నింపేందుకే బాబు సమాయత్తమయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేసేందుకు కార్యకర్తలను రెడీ చేస్తున్నారు. దీని కోసం అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఒదులుకునేందుకు సిద్ధంగా లేరన్నట్లు తెలుస్తోంది. అందుకే కార్యకర్తల్లో మనోధైర్యం నింపే పనిలో పడ్డారు. చంద్రబాబులో వస్తున్న మార్పు చూస్తుంటే సీనియర్ కార్యకర్తల్లో సైతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆయన తీరుపై పార్టీల్లో చర్చనీయాంశం అవుతోంది

    రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బాబు తన వైఖరిలో మార్పు తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది. విజయమే లక్ష్యంగా కార్యకర్తలను కార్యోణ్ముఖులను చేయడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు. నేతలు, కార్యకర్తలు పార్టీని వీడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీని వీడిన సందర్భంలో మరింత మంది కార్యకర్తలను దూరం చేసుకోకుండా ఉండేందుకే పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి సవాలు విసిరేందుకు సన్నద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    Also Read: సౌందర్య వాళ్లను చూసిన కార్తీక్.. మోనితవైపు ప్లేట్ మారుస్తున్న బస్తీ వాళ్ళు!

    Tags