Minister Niranjan Reddy: డ్యూడ్.. రైతులపై ప్రేమ.. ప్రభాస్ డైలాగ్ తో కొట్టిన తెలంగాణ మంత్రి

Minister Niranjan Reddy: కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లు.., కడుపులో లేనిది కౌగిగించుకుంటే వస్తుందా? పెట్టి పొయ్యనమ్మ పెయంత పునికిందట అన్నట్లు తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు రైతులే తమ దైవాలని చెబుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం సినిమా డైలాగులు విసురుతూ రైతులను ఆకట్టుకోవాలని చూశారు. మాటల్లో కాదు చేతల్లో చూపించాల్సి ఉంటుంది. రైతుల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం […]

Written By: Srinivas, Updated On : January 15, 2022 2:04 pm
Follow us on

Minister Niranjan Reddy: కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లు.., కడుపులో లేనిది కౌగిగించుకుంటే వస్తుందా? పెట్టి పొయ్యనమ్మ పెయంత పునికిందట అన్నట్లు తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు రైతులే తమ దైవాలని చెబుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం సినిమా డైలాగులు విసురుతూ రైతులను ఆకట్టుకోవాలని చూశారు. మాటల్లో కాదు చేతల్లో చూపించాల్సి ఉంటుంది. రైతుల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం కాదు వారి కోసం ఏం చేశారో చూపించాల్సి ఉంటుంది. మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పినట్లు రైతులను ప్రేమిస్తాం డ్యూడ్ మహా అయితే తిరిగి ప్రేమిస్తారంటూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Minister Niranjan Reddy:

ఊరకే సినిమా మాటలు ఎవరైనా చెబుతారు. ఆచరించి చూపేవాడే ఆచార్యుడు అన్నట్లు రైతుల కోసం ఏం చేశారో చూపించాలి. రైతుబంధు ఇస్తున్నాం… ఎరువులు ఇస్తున్నాం.. మద్దతు ధర ఇస్తున్నాం అంటే అవి అందరు ఇచ్చేవే. మీరు కొత్తగా ఇచ్చేది ఏదైనా ఉందా? అది కావాలి. కానీ ఉత్తిత్తి మాటలకు నువ్వంటే నాకిష్టం.. నేనంటే నీకిష్టం అని ప్రేమలు ఒలకబోయడం కాదు. ప్రేమంటే చిరస్థాయిగా ఉండాలి. రైతుల గుండెల్లో నిలవాలి. కలకాలం గుర్తుండిపోవాలి. అదే ప్రేమంటే. కానీ ఇలా చిల్లర రాజకీయాలు తగదని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి.

Also Read:  సంక్రాంతికి ప్రత్యేకంగా తెలుగు వారు చేసే వంటకాలు, వాటి ప్రత్యేకతలు ఇవే..

రైతు సమస్యలను రాజకీయం చేస్తూ లబ్ధిపొందాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే వారిపై లేని ప్రేమను చూపిస్తంది. కానీ వారి కోసం ఎన్ని పథకాలు తెచ్చారు? ఎంత ఖర్చు చేశారు. రుణమాఫీ ఏక కాలంలో చేశారా? విత్తనాల్లో రాయితీలు ఇచ్చారా? ఎరువుల్లో సబ్సిడీలు కల్పించారా? అంటే సమాధానాలు మాత్రం కనిపించవు. ఎందుకంటే ఏదో చేశాములే అనుకునే ధోరణిలోనే ఉన్నారు తప్ప మేమే రైతులకు అండగా ఉన్నామని గుండెల మీద చేయి వేసుకుని చెప్పమనండి.

తెలంగాణలో అభివృద్ధి చేసింది మేమనని గొప్పలు చెప్పుకుంటున్నారు. వారు చేసిందేదో కనిపించడం లేదు. ప్రాజెక్టులు కడితే అయిపోయిందా? సంక్షేమ పథకాల అమలు ఎంత మేర చేశారో చెప్పాలి. ఏ ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందలేదు. ఒక్క కల్యాణ లక్ష్మి తప్ప వారు చేసింది శూన్యమే. దీంతో ప్రజల్లో ఆగ్రహం కూడా పెరిగిపోతోంది. అధికార పార్టీ విధానాలతో విసిగిపోయారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భంగపాటే అని సర్వేలు సూచిస్తున్నాయి.

ఈ భయంతోనే టీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేసుకుని పోరాటం చేస్తోంది. బీజేపీని ప్రత్యామ్నాయంగా ఎదగనీయొద్దనే ఉద్దేశంతోనే కేంద్రంపై దాడికి రెడీ అవుతోంది. బీజేపీయేతర కూటమి కోసం తాపత్రయ పడుతోంది. కానీ దేశంలో మోడీ చరిష్మా ఇంకా తగ్గలేదనే వాస్తవం వారికి తెలియడం లేదు. అందుకే ఆర్జేడీ, డీఎంకే, కమ్యూనిస్టులతో కలిసి మూడో కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలతో జట్టు కట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ వారి ఆశలు తీరే దారి కనిపించడం లేదు. దీంతోనే మానసికంగా ఎదురుదాడి చేయడానికే నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే బీజేపీని ఎదుర్కోవాలని భావిస్తోంది.

Also Read: సంక్రాంతి విశిష్టత, ఈ రోజున చేయాల్సిన దానాలేంటో మీకు తెలుసా?

Tags