https://oktelugu.com/

Sankranthi Recipes: సంక్రాంతికి ప్రత్యేకంగా తెలుగు వారు చేసే వంటకాలు, వాటి ప్రత్యేకతలు ఇవే..

Sankranthi Recipes : ఉభయ తెలుగు రాష్ట్రాలు అత్యంత వైభవోపేతంగా, ఆనందంగా జరుపుకునే పండుగల్లో ఒకటి ‘సంక్రాంతి’. ఈ పండుగకు కుటుంబ సభ్యులందరూ ఎక్కడున్నా సొంతూళ్లకు పయనమవుతుంటారు. అలా చక్కగా అందరూ ఒక చోట చేరి హ్యాపీగా పండుగ జరుపుకుంటారు. కుటుంబం అంతా కూడా అలా హ్యాపీగా పండుగ నిర్వహించుకుంటారు. ఇకపోతే ఈ పండుగ సందర్భంగా ప్రత్యేకమైన పిండి వంటకాలను చేసుకుంటారు. అవేంటో తెలుసుకుందాం. ఈ సంక్రాంతి సందర్భంగా కొన్ని చోట్ల శాకాహార వంటలు మాత్రమే చేస్తుంటారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 15, 2022 12:27 pm
    Follow us on

    Sankranthi Recipes : ఉభయ తెలుగు రాష్ట్రాలు అత్యంత వైభవోపేతంగా, ఆనందంగా జరుపుకునే పండుగల్లో ఒకటి ‘సంక్రాంతి’. ఈ పండుగకు కుటుంబ సభ్యులందరూ ఎక్కడున్నా సొంతూళ్లకు పయనమవుతుంటారు. అలా చక్కగా అందరూ ఒక చోట చేరి హ్యాపీగా పండుగ జరుపుకుంటారు. కుటుంబం అంతా కూడా అలా హ్యాపీగా పండుగ నిర్వహించుకుంటారు. ఇకపోతే ఈ పండుగ సందర్భంగా ప్రత్యేకమైన పిండి వంటకాలను చేసుకుంటారు. అవేంటో తెలుసుకుందాం.

    sankranthi dishes1

    ఈ సంక్రాంతి సందర్భంగా కొన్ని చోట్ల శాకాహార వంటలు మాత్రమే చేస్తుంటారు. కాగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం మాంసాహారం కూడా తీసుకుంటుంటారు. ఈ సంగతులు అలా ఉంచితే… సంక్రాంతి సందర్భంగా చేసే వంటకాల గురించి పూర్వీకులు చెప్పారని, అందుకు ఆధారాలున్నాయని కొందరు పెద్దలు వివరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి సందర్భంగా మినుము పప్పు, ఇడ్లీ పిండితో చేసిన ఇడ్లీలను పొట్టేలు మాంసంతో కలిపి తింటుంటారు. చక్కెర పొంగలి కూడా స్పెషల్ ఐటం కాగా. 12వ శతాబ్దంలోని శ్రీనాథుడి కాలం నుంచి ఈ వంటకం ఉందని పెద్దలు చెప్తున్నారు.

    మిరియాలు, ఇంగువ, జీలకర్ర వేసి చేసే కటు పొంగలి కూడా చేస్తుంటారు. పులిహోర కూడా చేస్తుంటారు. శ్రీ నాథుడు రచించిన కావ్యాల్లోనూ పులిహోర ప్రస్తావన ఉండటం మనం చూడొచ్చు. అరిసెలు కూడా చాలా ఫేమస్. 15 వ శతాబ్దపు వైద్య గ్రంథంలో వరి ప్రస్తావన ఉండగా, ఆ కాంలోనూ అరిసెలు చేసుకునే వారట. ఇకపోతే సంక్రాంతి సందర్భంగా గుమ్మడి కాయ కూరను బెల్లంతో కలిపి వండుకుంటుంటారు. దీనిని బ్రాహ్మణులకు దానం ఇస్తుంటారు. దీనిని ‘దప్పళం’ అని కూడా పిలుస్తారు. నువ్వు ఉండలు, బొబ్బట్లు, కలగూర కూడా చేస్తుంటారు.

    చిక్కుడుకాయ, చిలగడ దుంప, వంకాయ, అరటికాయ, టమాటోతో కలిపి కలగూర వండటం మనం ఇప్పటికీ చూడొచ్చు. ఇకపోతే సంక్రాంతి సందర్భంగా ప్రతీ ఒక్కరు కొత్త బట్టలు ధరించి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటారు. తెలంగాణలో సంక్రాంతికి సకినాలు బాగా ఫేమస్. ప్రతీ ఇంట్లో కంపల్సరీగా సకినాలు చేస్తుంటారు. నువ్వు ఉండలు కూడా చేస్తుంటారు. నువ్వుల స్నానం చేయడంతో పాటు నువ్వుల వంటకాలు తీసుకుంటే కనుక చాలా చక్కటి ప్రయోజనాలుంటాయని పెద్దలు చెప్తున్నారు.

    Tags