TDP Mahanadu : టీడీపీ మహానాడు వేదికగా చంద్రబాబు స్కెచ్, పొత్తుపైనా క్లారిటీ?

భవిష్యత్తు కార్యాచరణను టీడీపీ మహానాడు వేదికగా చేసుకుందని తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కీలక అంశాలపై నాన్చుడు ధోరణిలో కాకుండా ఒక స్పష్టత ఉంటుందని టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

Written By: SHAIK SADIQ, Updated On : May 7, 2023 8:46 am
Follow us on

TDP Mahanadu : రాబోవు ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా తెలుగు దేశం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. మరికొద్ది రోజుల్లో రాజమండ్రి వేదికగా నిర్వహించనున్న మహానాడు పలు సంచనాలకు వేదికగా నిలిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వైపీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేన పొత్తుపై కూడా ఒక క్లారిటీ ఇచ్చి తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ నింపేందుకు చంద్రబాబు నాయుడు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం.

ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మహానాడును అట్టహాసంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. అభ్యర్థుల ప్రకటన అంశం ఒక కొలిక్కి రాలేదు. అక్కడక్కడ ఇన్‌చార్జుల విషయంలో గందరగోళం నెలకొని ఉంది. ఈ క్రమంలో మహానాడులో అభ్యర్థుల విషయంలోను ఒక కొలిక్కి రానున్నట్లు సమాచారం. సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలపై స్పష్టత ఇవ్వనున్నట్లు పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తుంది.

టీడీపీ, జనసేన ఇప్పటికే కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాలుగుసార్లు భేటీ అయ్యారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఆయన చరిష్మా ఎన్నికల్లో బాగా పనిచేయనునంది. కొత్తగా ఏర్పాటయ్యే తెలుగు దేశం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించనున్నారు. ఆయనకు కేటాయించే సీట్ల ఎన్ని అని తెలియరాలేదు. దీనిపైనా చంద్రబాబు ముగింపు ఉపన్యాసంలో ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.

భవిష్యత్తు కార్యాచరణను టీడీపీ మహానాడు వేదికగా చేసుకుందని తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కీలక అంశాలపై నాన్చుడు ధోరణిలో కాకుండా ఒక స్పష్టత ఉంటుందని టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. మరింత ఆలస్యం చేస్తే ఇరు పార్టీలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు సరికొత్త వ్యూహాలకు మహానాడు వేదికవుతందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.