Ugram 2nd Day Collections : అల్లరి నరేష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఉగ్రం’ రీసెంట్ గానే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం విడుదలైన రోజే గోపీచంద్ రామబాణం సినిమా కూడా విడుదలైంది.ఈ రెండు సినిమాల్లో రేటింగ్స్ పరంగా మరియు టాక్ పరంగా ఉగ్రం చిత్రానికే మంచిగా ఉండడం తో ఆడియన్స్ కి ప్రస్తుతం ఉన్న సినిమాలలో ‘విరూపాక్ష’ తర్వాత ‘ఉగ్రం’ సినిమానే ఛాయస్ గా ఉన్నది అని చెప్పొచ్చు.
నరేష్ ని ఇంత మాస్ యాంగిల్ లో చూసిన ప్రేక్షకులు థ్రిల్ కి ఫీల్ అయ్యారు, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశానికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.అందుకే బీ ,సి సెంటర్స్ లో ‘ఉగ్రం’ చిత్రానికి రెండవ రోజు కూడా డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయి.మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం రెండవ రోజు కూడా ఈ చిత్రానికి 60 లక్షల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చి ఉంటుందని అంచనా,అలా రెండు రోజులకు కలిపి ఈ సినిమా కోటి 32 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 6 కోట్ల 20 లక్షల రూపాయలకు జరిగింది.
రెండు రోజుల్లో కోటి 32 లక్షల రూపాయిలను రాబట్టిన ఈ సినిమా, ఆదివారం రోజు కనీసం 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.వర్కింగ్ డేస్ లో కూడా కాస్త డీసెంట్ హోల్డ్ ఉంచుకోగలిగితే ఈ చిత్రం ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే ఛాన్స్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మరి వాళ్ళ అంచనాల ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది చూడాలి.